A l l L i v e T e l u g u C h a n n e l s
Recent Updates

రూ. ఐదు కోట్లు గోవిందా...! అనుష్క ఆవేదన..!టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అందాల సుందరి అనుష్క. ఈ బ్యూటీ ఐదు కోట్ల రూపాయలు పోయిందంటూ గంగ్గోలు పెడుతోంది. ఇంతకీ ఆ ఐదు కోట్ల రూపాయల వ్యవహారం ఏంటి? ఎలా వచ్చింది.. ఎలా పోయింది..? అనుకుంటున్నారా. అయితే చదవండి మీకే విషయం తెలుస్తుంది.

ప్రస్తుతం అనుష్క తెలుగులో బాహుబలి, రుద్రమదేవి వంటి  రెండు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ అమ్మడు రజనీకాంత్ సరసన నటించిన లింగా చిత్రంపై ఎంతో ఆశలు పెట్టుకుందట. ఆ చిత్రం మోజులో పడి అప్పుడు వచ్చిన పలు ఆఫర్లను వదులుకుందట.

అనుష్క లింగా చిత్రంలో నటిస్తుండగా  విజయ్, విశాల్, కార్తీలతో నటించే ఛాన్స్‌లు వచ్చినా, లింగా షూటింగ్ డేట్స్ కారణంగా ఆ చిత్రాల్లో మళ్లీ నటిస్తానని పోస్టుపోన్ చేసుకుందట. అయితే అలా అన్నింటిని పక్కనపెట్టి లింగాపై ఆశలు పెట్టుకుందట. లింగా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టడంతో అనుష్క తీవ్ర నిరాశకు లోనైంది.

కాగా లింగా చిత్రం నటించే రోజుల్లో వచ్చిన ఆఫర్లలో నటించాలని అనుకుంటే, లింగా లిజ్ట్‌తో తనకు వచ్చిన ఆఫర్లు అన్ని వేరేవాళ్లకు వెళ్లిపోయాట. తద్వారా తనకు ఐదు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం పోయిందని అనుష్క ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ప్రస్తుతం నటిస్తున్న తెలుగులో రెండు చిత్రాలపైన, తమిళంలో ఒక చిత్రంపైన అనుష్క ఆశలు పెట్టుకుంది.


{[['']]}

గోపాల గోపాల: బస్సులో పైరసీ బాగోతం...
‘గోపాల గోపాల' సినిమా కేవలం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే కాదు...కొన్ని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలకు కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. అయినా ప్రైవేట్ బస్సు ట్రావెల్స్‌కు...ఈ సినిమాకు లింకేటి? అనుకుంటున్నారా. అయితే మీరు ఈ పైరసీ భాగోతం గురించి తెలుసుకోవాల్సిందే. ‘సంక్రాంతి' పండగ సందర్భంగా సొంతూర్లకు వెలుతున్న వారిని ఆకర్షించేందుకు కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వారు ‘గోపాల గోపాల' పైరసీ సీడీలను బస్సుల్లో ప్రదర్శిస్తున్నారు. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ఈ బాగోతం బయట పడటం అందరినీ షాక్‌కు గురి చేసింది. బస్సులో ఉన్న పవర్‌స్టార్‌ అభిమాని ఈ బండారం బయట పెట్టినట్లు సమాచారం. వెంటనే యాంటీ పైరసీ టీమ్స్ రంగంలోకి దిగాయి.{[['']]}

మధ్యాహ్నం వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు
జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత  వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరగనున్నాయి. ఆయన భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు, ఎంపీ, నటుడు మురళీ మోహన్ తదితరులు ఈరోజు ఉదయం రాజేంద్రప్రసాద్ భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు.

అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ సందర్శనార్థం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకూ ఫిలిం చాంబర్ లో రాజేంద్రప్రసాద్ పార్థివదేహాన్ని ఉంచుతారు. అక్కడ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. కాగా కొన్నేళ్లుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న రాజేంద్రప్రసాద్ సోమాజిగూడలోని ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.


{[['']]}

పవన్ క్రేజ్: తలకెక్కిన అభిమానం, కోసుకున్న నితిన్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అంటే క్రేజ్ ఎలా ఉందంటే....ఆయనకు ఉన్నది అభిమానులు కాదు, భక్తులు అనేంతగా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో ‘గోపాల గోపాల' చిత్రం విడుదలైన తర్వాత ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వెండితెరపై దేవుడిగా దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్‌కి థియేటర్లోనే కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చారు అభిమానులు.

ఆయనంటే ఎంత అభిమానమో చాటు కోవడానికి ఏకంగా గుండుపై ‘గోపాల గోపాల' టైటిల్, పవన్ కళ్యాణ్ ఫోటో వచ్చేలా హెయిర్ కట్ చేయించుకున్నాడు ఓ అభిమాని. ఆ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు నితిన్ లాంటి యంగ్ హీరోలు సైతం ఉన్నారు. పవన్ కళ్యాణ్ ని డెమీ గాడ్ గా కొలిచేవారిలో యువహీరో నితిన్ ముందువరుసలో వుంటాడు.

పవన్‌ని తెరపై దేవుడి రూపంలో చూడగానే నితిన్ వేలుకు కోసుకుని ఆ రక్తంతో పవన్‌కి తిలకం దిద్దినట్టు సమాచారం. ఇంత కాలం నితిన్ పవన్ కళ్యాణ్ జపం జపిస్తున్నాడంటే....తన సినిమాలకు పబ్లిసిటీ తేవడానికే అని అంతా అనుకున్నారు. కానీ అతనిలో నిజమైన అభిమానం ఉందని ఈ సంఘటన రుజువు చేస్తోందని తోటి ఫ్యాన్స్ అంటున్నారు.


{[['']]}

షాకిచ్చిన హీరోయిన్: ముద్దులతో వేడెక్కిస్తోంది (ఫోటోస్)

తెలుగులో ‘నువ్విలా' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచమైన భామ యామీ గౌతం. ఆ తర్వాత గౌరవం, యుద్దం లాంటి చిత్రాల్లో నటించినా ఇక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే బాలీవుడ్లో మాత్రం తొలి చిత్రం ‘వికీ డోనర్' చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అక్కడ అవకాశాలు లేక దక్షిణాది సినిమాల వైపు వచ్చింది. 

మళ్లీ బాలీవుడ్లో అవకాశాలు పలకరించడంతో....భలే మంచి ఛాన్సు అనుకున్న ఈ భామ అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందాల ఆరబోత, సెక్సీ సీన్ల విషయంలో ఇప్పటి వరకు హద్దుల్లో ఉన్న యామి గౌతం ఇలా ఉండటం వల్ల కెరీర్లో ముందుకు సాగలేమని గ్రహించినట్లుంది. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి చేస్తున్న ‘బద్లాపూర్' చిత్రంలో హాట్ హాట్ పడకగది సీన్లు, వేడెక్కించే ముద్దు సీన్లలో నటిస్తూ ఒక్కరిగా అందరినీ షాక్‌కు గురి చేసింది.{[['']]}

దేవుడ్ని ప్రశ్నిస్తున్న మహేష్ బాబు (ఫొటో)మహేష్,శృతిహాసన్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ లో భాగంగా మహేష్ బాబు..దేవుడ్ని ప్రశ్నిస్తున్న సన్నివేశం చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

లొకేషన్ లోని ఈ ఫొటో బయిటకు వచ్చింది. మీరూ ఓ లుక్కేయండి ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 17 న మహా శివరాత్రి పూట విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మే 1 న సినిమాని విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిర్మాత,దర్శకుడు ఇప్పటివరకూ ఏ టైటిలూ ప్రకటించలేదు. ఈ టైటిల్ ని రిజిస్టర్ మాత్రం చేసారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ అయితే ఖరారు కాలేదు. ఆ మధ్య పలు టైటిల్స్ వినిపించినా...అవేవీ కాదని కొట్టిపారేసారు దర్శకుడు శివ.


{[['']]}

చిరు, పవన్‌ సినిమాలు ఒకే రోజు విడుదలైతే...?


అవును... ఇటువంటి ఆలోచనలు ఫ్యాన్స్‌కు వచ్చిందో లేదో కానీ.. వింత ఆలోచనలు వున్నవారికి వస్తాయి. అలాంటి కోవలోకి దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వస్తాడు. ఇటీవల ఏదోవిధంగా మీడియాలో నానుతూ వుండే ఆయన గోపాల గోపాల సినిమా తర్వాత ట్విట్టర్‌లో ట్వీట్‌ పోస్ట్‌ చేశాడు.

చిరంజీవి 150వ సినిమాకు కథ దొరక్క ఎదురుచూస్తున్నారు. ఒకవేళ దొరికి సినిమాగా వచ్చాక.. మరోవైపు పవన్‌ కళ్యాన్‌ సినిమా కూడా అదే రోజు విడుదలైతే ఎలా వుంటుందో చూడాలని కుతూహలంగా వుందంటున్నాడు.

రామూజీ చెప్పినదాంట్లోనూ పాయింట్ ఉంది. అన్న అండతోనే తమ్ముడు ఈ రంగంలో ఎదిగినా...ప్రస్తుతం అన్నయ్యను మించి పోయాడు. మరి ఇద్దరి సినిమా ఒకే రోజు విడుదలైతే....బాక్సాఫీసు వద్ద పోటీ రసవత్తరంగా ఉంటుంది. చిరంజీవి 150వ సినిమా విషయానికొస్తే...2015లో తప్పుండా వస్తుందని అంటున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓఆసక్తికర అంశం పిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో ఈ విషయం తేలనుందట.


{[['']]}

మహేష్ 'బ్రహ్మోత్సవం' సినిమాలో రజనీకాంత్ఇద్దరు పెద్ద హీరోలు ఒకే సినిమాలో ఉంటే కలెక్షన్ల ప్రభంజనమే. త్వరలో మనం వెండి తెరపై సూపర్ కాంబినేషన్ చూడబోతున్నాం. మహేష్ బాబు సినిమాలో రజనీకాంత్‌తో ఓ ముఖ్యమైన పాత్ర చేయించే ప్లాన్లో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే....త్వరలో మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' అనే చిత్రం చేయబోతున్నాడు.

ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం రజనీకాంత్ ను సంప్రదిస్తున్నారట. త్వరలోనే ఆయనకు సినిమా స్టోరీ వివరించనున్నారు. రజనీకాంత్ అంగీకారం తెలుపుతారనే నమ్మకంతో ఉన్నారు. ఏ విషయం అనేది త్వరలో తేలనుంది. ఈచిత్రాన్ని పివిపి సినిమా అధినేత ప్రసాద్ వి పొట్లూరి నిర్మించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఏ విషయం అనేది తేలనుంది. మే నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.{[['']]}

అయినవాళ్లే చక్రిని చంపేసారా? ఫ్యాన్స్ షాక్...సంగీత దర్శకుడు చక్రి మరణం ఇంతకాలం సహజమైన గుండె పోటు మరణమనే అని అంతా అనుకుంటున్నాం. చక్రి హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని అపోలో ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించిన విషయం తెలిసిందే. కానీ ఆయన మరణం వెనక కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందనే వాదన తెరపైకి వచ్చింది. ఇది విని చక్రి అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.

చక్రిది సహజ మరణంకాదని, అత్తింటి వారి ప్రమేయం ఉందనే అనుమానంతో చక్రి భార్య శ్రావణి.... నా కొడుకు మరణం వెనక భార్య ప్రమేయం ఉందనే అనుమానంతో చక్రి తల్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చక్రి సహజంగానే మరణించాడా? లేక విష ప్రయోగంతో మరణించారా? అనే విషయాలను పక్కన పెడితే, మరణానికి ముందు చక్రి......భార్య, తల్లి మధ్య గొడవల కారణంగా నలిగిపోయారని, మనో వేదనకు గురయ్యారని స్పష్టం అవుతోంది. బయట ఎన్ని గొడవలున్నా ఇంట్లో ప్రశాంతత ఉంటే స్వర్గమే. కానీ చక్రి ఇంట్లోనే కొన్నాళ్లుగా ప్రశాంతత లేకుండా ఉన్నట్లు స్పష్టం అవుతోందని అభిమానులు అంటున్నారు. తనకు ఉన్న అనుమానాల గురించి భార్య శ్రావణి వివరిస్తూ.... 'చక్రి చనిపోయే ముందురోజు మా అత్తగారింట్లో భోజనం చేశారు. చక్రి చనిపోగానే విలువైన డాక్యుమెంట్లు, ఆభరణాలు తీసేసుకున్నారు. ఆయన మరణంపై అనుమానం ఉంది' అని ఆమె ఫిర్యాదు చేసారు. తన భర్త చనిపోగానే ఆయన కుటుంబ సభ్యులు తనను వేధించటం మొదలు పెట్టారని శ్రావణి చెప్పారు.

అయితే చక్రి తల్లి విద్యావతి వాదన మరోలా ఉంది. ‘మావాడికి విషయం పెట్టినట్లు అనుమానం ఉంది. చనిపోయినపుడు శరీరం నల్లగా మారింది. పోలీసులతో పాటు పలువురికి అనుమానం వచ్చింది. కానీ వాళ్లూ వీళ్లూ మాట్లాడి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. ఇంటి నుంచి మేం బయటకు వెళ్లకపోతే చక్రిని చంపేస్తానని గతంలో ఆమె మమ్మల్ని బెదిరించింది. దాంతో మేం బయటకు వచ్చేశాం. ముందు రోజు రాత్రి ఒంటిగంటదాకా తన బావలతో మాట్లాడాడు చక్రి. తినమన్నా డైటింగ్ పేరు చెప్పి ఏమీ తినలేదు. ఇంటికెళ్లి ఏం తిన్నాడో ఏమో మాకు తెలియదు. మరుసటి రోజు చనిపోయాడని ఏడు గంటలకు ఫోన్ చేసింది. పోస్ట్ మార్టమ్ చేసుంటే నిజానిజాలు తెలిసేవి. కానీ అవేమీ చేయనివ్వకుండా మిగిలిన పనులు చేసేశారు. నాకు భర్త కూడా లేడు. నా బిడ్డలను చూసినా ఆమె ఓర్వలేదు. మా బాబు మరణంలో మాకు అనుమానాలున్నాయి. ఈ విషయాన్ని ముందే చెబుదామనుకుంటే పరువు బజారుపాలు కాకూడదని ఊరకున్నాం. కానీ మా బాబు పోయిన మూడో రోజు నుంచి మమ్మల్ని బజారు పాలు చేసింది' అని చెప్పారు.

ఇరు వర్గాల ఫిర్యాదులను తీసుకున్న పోలీసులు కేసు విచారిస్తున్నారు. మరి ఏం తేలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఒక విషయం మాత్రం నిజం. చక్రి మరణం తర్వాత జరుగుతున్న ఈ పరిణామాల వెనక ఆస్తి వివాదాలు ఉన్నాయని మాత్రం స్పష్టం అవుతోంది. అయిన వాళ్ల కారణంగానే ఆయన ఊపిరి ఆగిపోయిందనేది వాస్తవం అని నమ్ముతున్నారు అభిమానులు.


{[['']]}

యావరేజ్: ‘గోపాల గోపాల’ యూఎస్ఏ కలెక్షన్స్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన ‘గోపాల గోపాల' చిత్రం కలెక్షన్స్ యూఎస్ఏలో ఆశించినంతగా లేదనే వాదన వినిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్లను నిరాశ పరిచినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అక్కడ శుక్రవారం ప్రీమియర్ షోలతో మొదలైంది. మొత్తం 101 లొకేషన్లలో సినిమా విడుదలైంది.

శుక్రవారం $282000, శనివారం $305000, ఆదివారం కేవలం $120000 మాత్రమే వసూలు చేసింది. ఇప్పటి వరకు కేవలం $707000 మాత్రమే వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ 1 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. సంక్రాంతికి ‘ఐ' సినిమా వస్తుండటంతో చాలా థియేటర్ల ‘గోపాల గోపాల' తీసేసి ‘ఐ' వేస్తున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం 1 మిలియన్ మార్కు అందుకోవడం కష్టమే అంటున్నారు.


నైజాం: 2.82 కోట్లు
 సీడెడ్ : 1.62 కోట్లు
ఉత్తరాంధ్ర: 87 లక్షలు
తూర్పు గోదావరి: 1.21 కోట్లు
పశ్చిమ గోదావరి: 76 లక్షలు
కృష్ణా : 61.3 లక్షలు
గుంటూరు: 1 కోట్లు
నెల్లూరు : 30.14 లక్షలు
మొత్తం ఎపి+నైజాం : 9.19 Crore
గమనిక: ఇవన్నీ ట్రేడ్ లో చెప్పబడుతున్న లెక్కలు మాత్రమే


{[['']]}

నయనతార సన్యాసం?సౌతిండియా స్టార్ హీరోయిన్ నయనతార గురించి ఓ షాకింగ్ న్యూస్ మీడియాలో ప్రచారంలో జరుగుతోంది. ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రేమలో విఫలమై డక్కామొక్కలు తిన్న ఆమె ఈ సారి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జీవితంలో ఇంకా ముఖ్యమైన సుఖాలు అనుభవించకుండానే వాటికి దూరం కావాలని నిర్ణయించుకుందట. ఆమె నిర్ణయం మరేదో కాదు.... జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోవాలని నిర్ణయించుకుందట. ఆయన నిర్ణయాన్ని బట్టి ఇక నయన జీవితంలో సంసార సుఖం అనుభవించే యోగ్యం లేదని స్పష్టమవుతోంది

గతంలో శింబుతో పీకల్లోతు ప్రేమాయణంలో మునిగి నయనతార.....తర్వాత అతనికి దూరమైంది. తర్వాత ప్రభుదేవాతో వ్యవహారం ఆమె జీవితంలో ఓ సంచలనం. ఇద్దరూ పెళ్లి చేసుకునే వరకు వెళ్లారు. నయన కోసం తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. ప్రభుదేవా కోసం నయనతార అప్పట్లో మతం మార్చుకుని సినిమాలను సైతం విడిచిపెట్టింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారు. కొంత కాలం తర్వాత నయనతాక సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

సెకండ్ ఇన్నింగ్స్‌లోను సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న అరుదైన నటీమణుల్లో ఒకరీమె. రాజారాణి, ఆరంభం, ఇదు కదిర్‌వేల్ కాదల్ లాంటి చిత్రాల విజయాలు నయనతారకు సెకండ్ ఇన్నింగ్‌లో చాలా హెల్ప్ అయ్యాయి. ఈ మధ్య వచ్చిన అన్భే నీ ఎంగే చిత్రం నిరాశ పరచినా నటిగా ఆమె కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సంచలన నటి సూర్యతో మాస్, ఉదయనిధి సరసన నన్భేండా, జయంరవికి జంటగా తనీ ఒరువన్ చిత్రాలతో పాటు లేడి ఓరియంటెడ్ చిత్రం మాయ చేస్తూ బిజీగా వున్నారు.


{[['']]}

బికినీయే కారణం కాదు!‘మిస్ వరల్డ్’ కిరీటం సొంతం చేసుకోవడం అంత సులువు కాదు. చక్కటి శరీర కొలతలతో పాటు సమయ స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ... ఇలా ఎన్నో విషయాల్లో మార్కులు సంపాదిస్తేనే ఆ బిరుదు సొంతం అవుతుంది. అలాగే, ఈ పోటీల్లో భాగంగా ‘బికినీ రౌండ్’ ఒకటుంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పోటీలో నిలిచే భామలు ఈత దుస్తులు ధరించాల్సిందే. అయితే, ఇక ఈత దుస్తులు ధరించాల్సిన అవసరంలేదు.

‘మిస్ వరల్డ్’ పోటీలకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న జూలియా మోర్లీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈత దుస్తుల వల్ల అమ్మాయికి ఒరిగేదేమీ లేదనీ, ఆ మాటకొస్తే దానివల్ల ఎవరికీ ఏమీ ఒరగదని ఈ సందర్భంగా జూలియా పేర్కొన్నారు. దీని గురించి ఐశ్వర్యా రాయ్ స్పందిస్తూ -‘‘1994లో నేను ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్నాను. వాస్తవానికి ఆ సమయంలో నాతో పాటు పోటీలో నిలిచిన 87 మంది అమ్మాయిలతో పోలిస్తే నా శరీరాకృతి ఈత దుస్తులకు అనువుగా ఉండేది కాదు.

కానీ, స్విమ్ సూట్ ధరించాలనే నిబంధన ఉండటంతో ఏమీ చేయలేకపోయాను. అయినప్పటికీ నేను ప్రపంచ సుందరి కిరీటం సాధించగలిగాను. ఈ కిరీటాన్ని ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేది బికినీ రౌండే అని చాలామంది భావిస్తారు. కానీ, అదొక్కటే కాదు. ఆత్మవిశ్వాసం, ప్రవర్తన.. ఇలా చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఏదేమైనా బికినీ రౌండ్ తీసేసినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.

{[['']]}

సంక్రాంతికి శంకర్ ''ఐ'': అడ్డంకులు హుష్ కాకి!విక్రమ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన భారీ చిత్రం ‘ఐ’ ఈనెల 14వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది.

శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ నటించిన 'ఐ' చిత్రం ఆర్థిక ఇబ్బందుల్ని దాటుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తయి యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. తమిళంలో ఆస్కార్‌ వి. రవిచంద్రన్‌ నిర్మించగా తెలుగులో సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రై.లిమిటెడ్‌ విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా రవిచంద్రన్‌ మాట్లాడుతూ.... 'ఐ' సినిమాకు సంబంధించిన అన్నీ క్లియర్‌ అయ్యాయి.


{[['']]}

ప్రయోగాల వేళ ( ' గోపాల గోపాల ' రివ్యూ)


Rating:2.5/5

"నేను టైమ్ కు రావటం కాదు మిత్రమా...నేను వచ్చాకే టైమ్ వస్తుంది " అంటూ ఎదురుచూస్తున్న పవన్కళ్యాణ్ కృష్ణుడుగా వచ్చేసాడు. అయితే ఈ సారి ఓ ప్రయోగం లాంటి కాన్సెప్టు ఓరియెంటెడ్ చిత్రంతో వచ్చారు.తన పాత్రకు రెగ్యులర్ మసాలా దినుసులు(హీరోయిన్స్, రొమాన్స్,పాటలు,ఫైట్స్) లేకపోయినా బాగుందనిపించారు.ముఖ్యంగా దొంగ స్వాములు, మూఢ నమ్మకాలపై ఎక్కుపెట్టిన ప్రశ్నలు కొన్ని ఆలోచనలో పడేసే దిసగాప్రయత్నించారు. అయితే సామాన్య జనాలకు పెద్దగా పరిచయం లేని 'యాక్ట్ ఆఫ్ గాడ్' క్లాజ్ చుట్టూ కథ తిరగటం, సెకండాఫ్ లో ఎక్కువ భాగం కోర్టు సీన్స్, మెలోడ్రామా, మెసేజ్, తో నింపటం జరిగింది. అలాగే ఎంటర్టైన్మెంట్ పాళ్లుకూడా చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఓ ప్రయోగంగా చూస్తే బాగుందనిపించే ఈ చిత్రం కమర్షియల్ గా భాక్సాఫీస్ వద్ద ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. అవన్నీ ప్రక్కన పెడితే పవన్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో... వాటిని ప్రక్కన పెట్టి మెసేజ్ తో కూడిన ఇలాంటి చిత్రంతో ముందుకు రావటం మాత్రం అభినందనీయం.

కథ:

గోపాల (విక్టరీ వెంకటేష్) వివిధ రకాల దేవుడి ప్రతిమలను విక్రయించుకునే చిరు వ్యాపారి. అతని షాపుకు ఒక సాధువు వస్తారు. ఆ సాధువుతో గోపాల చిన్నపాటి గొడవ పడతాడు. దీంతో ఆగ్రహించిన ఆ సాధువు.. గోపాలను శపిస్తాడు. అలా శపించిన మరుసటి రోజే భూకంపం వచ్చి కేవలం గోపాల షాపు మాత్రమే ధ్వంసమై పోతుంది. దీంతో ఇతర వ్యాపారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ గోపాలను ఓదార్చుతారు.

అయితే, గోపాల మాత్రం ఆ సాధువు శాపం వల్లే ఇలా జరిగిందని వారికి వివరిస్తారు. అదేసమయంలో షాపునకు ఉన్న రూ. కోటి బీమాను క్లైమ్ చేసుకునేందుకు బీమా కార్యాలయానికి వెళతారు. ఇది దేవుడి శాపం వల్ల జరిగిన ప్రమాదమని అందువల్ల నష్టపరిహారం చెల్లించలేమని బీమా కంపెనీవారు సమాధానం ఇవ్వడమే కాకుండా, దేవుడిపై కేసు పెట్టుకోమని సలహా ఇస్తారు.

దీంతో గోపాల దేవుడిపై కేసు నమోదు చేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా అన్ని మత పెద్దలు, సాధువులకు నోటీసులు జారీ చేసి కోర్టుకు రావాలని పేర్కొంటారు. దీంతో సాధువులు, మతపెద్ద (మిథున్ చక్రవర్తి), మతపెద్దలు కోర్టుకు వస్తారు. అపుడు తమను గోపాల కోర్టుకు పిలిపించి అవమానించారంటూ అతనిపై దాడి చేస్తారు. ఈ గోపాలను రక్షించేందుకు దేవుడు (పవన్ కళ్యాణ్) భూమికి దిగివస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఏ విధంగా ఆ గోపాలుడు...ఈ గోపాలరావుని ఆదుకున్నాడు అనేది మిగతా కథ.

మనకి దేముడే దిగివస్తే తరహా కథలు కొత్తేమి కాదు. అయితే ఇందులో బ్యూటీ అంతా... దేముడు మీద కేసు వేయటం అనే అంశం. ఈ ఐడియా చుట్టూ అల్లిన ఈ కథ కు తెలుగులో మరింత అర్దమయ్యేలా(అర్దవంతంగా కాదు) ట్రీట్ మెంట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. వాస్తవానికి 'మేన్‌ హూ స్యూడ్‌ గాడ్‌' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా 'ఓ మై గాడ్‌'. తెరకెక్కింది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించింది.

పూర్తి డ్రామాతో నడిచే ఈ రెండు చిత్రాలుకు స్టార్ వ్యాల్యూ కన్నా కాన్సెప్ట్ బలంగా వెళ్లి ప్రేక్షకులను థియోటర్ వైపు నడిపించాయి. అయితే తెలుగులో మొదటి నుంచి ఇది పవన్ కళ్యాణ్ చిత్రం, మల్టి స్టారర్ చిత్రం అంటూ ప్రచారం చేసారు. దాంతో పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన చిత్రం కదా అని ఎక్కువ అంచనాలు ఏర్పడి,బిజినెస్ బాగా జరిగినా లోపలకి వెళ్లి చూస్తే పవన్ కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనే....అదీ ఏమీ చేసినట్లు ఉండదు.

 మొత్తం వెంకటేష్ చుట్టూ తిరుగుతూంటుంది. ఫస్టాఫ్ కేసు వేయటం, పవన్ రావటం దాకా బాగున్న ఈ చిత్రం కథనం, సెకండాఫ్ లో డ్రాగ్ అవుతూ వస్తుంది. సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. అలాగే నెగిటివ్ పాత్ర సైతం ఎస్టాబ్లిష్ సరిగ్గా కాకపోవటం(కేవలం ఫైట్స్ కోసం...అదీ పవన్ సేవ్ చేయటం కోసమే పెట్టినట్లున్నాయి) జరిగింది.ఈ కథ అంతిమ లక్ష్యం...వెంకటేష్ పాత్ర కేసు నెగ్గటమా లేక అతను నాస్తికత్వం వదలి దేముడు ఉన్నాడని అర్దం చేసుకోవటమా అనేది మరింత క్లారిటిగా చెప్తే బాగుండేది.

ఏది ఎలా ఉన్నా... మూఢ నమ్మకాలు, దొంగ స్వాములుపై వ్యంగ్య బాణంలాంటి ఇలాంటి ఆలోచనాత్మక చిత్రాలు తెలుగులో రావాల్సిన సమయం వచ్చింది. అందుకు పవన్, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు తమ ఇమేజ్ లు వదిలి ముందుకు రావటం శుభపరిణామం. పవన్ ఉన్నాడని ఆయన రెగ్యులర్ చిత్రం లాగ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళితే ఇలాంటి ప్రయోగాలు సక్సెస్ అవుతాయి.{[['']]}

మరోసారి వార్తల్లోకి ఈటీవీ ప్రభాకర్యాహూ, స్మైల్ రాజా స్మైల్ వంటి గేమ్ షోలతో ఈ మధ్య కాలంలో మరోసారి పాపులర్ అయిన ఈ టీవి ప్రభాకర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ సారి పాజిటివ్ నోట్ తో ఆయన వార్తల్లో నిలిచారచు. ఆయన త్వరలో మెగా ఫోన్ పట్టుకోనున్నారని సమాచారం.

అందుకు గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్ ముందుకు రావటం అందిరిలో ఆసక్తి రేపుతోంది. కొంత కాలం క్రితం అల్లు అరవింద్ ని కలిసిన ఈ టీవి ప్రభాకర్ ఓ కథ వినిపించాండని, అది బాగా నచ్చిన అరవింద్ గోఎ హెడ్ అన్నాడని తెలుస్తోంది. చాలా లో బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కనుందని, ఆ మాత్రం బడ్జెట్ తో సొంతంగా తీసుకోగలిగే కెపాసిటీ ఉన్నా...గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్ అండకోసం అరవింద్ ని కలిసాడని అంటున్నారు. స్క్రిప్టు విన్న అరవింద్ వెంటనే కొద్దిపాటి మార్పులు స్క్రిప్టులో చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్తున్నారు.

ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ ఆఫీస్ లోనే స్క్రిప్టు బెటర్ మెంట్స్ తో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నెలాఖరకు స్క్రిప్టుని లాక్ చేసి ఫైనల్ వెర్షన్ వినిపిస్తారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాసం కనిపిస్తోంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ప్రభాకర్ అతి కొద్ది కాలంలోనే టీవీ సీరియల్స్ లో క్యారెక్టర్ రోల్స్ చేసే స్దాయికి ఎదిగారు.

ఆలాగే ఎన్నో సీరియల్స్ లీడ్ రోల్స్ చేసి బుల్లితెరపై ఎంతో పాపులర్ అయ్యాడు. ఈ టీవీ సుమన్ తో కలిసి ఎన్నో సీరియల్స్ చేసిన ప్రభాకర్ జీ తెలుగులో వచ్చిన ‘ముద్దు బిడ్డ' సీరియల్ తో డైరెక్టర్ గా మారాడు. ఇప్పుడు ఈ సినిమాని డైరెక్ట్ చెయ్యడానికి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా గురించి అఫీషియల్ గా పూర్తి వివరాలు తెలియాంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


{[['']]}

బీచ్‌‍లో సెక్స్ కావాలంటూ ఇలియానా...సెన్సేషన్
ఆ మధ్య ఇలియానా సెక్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా మరోసారి సెక్స్ గురించి హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనాలిటీ, రిలేషన్ షిప్స్‌పై తన అభిప్రాయం, లవ్ అండ్ సెక్స్ గురించి వెల్లడించింది. ప్రియుడితో నువ్వు కావాలనుకునే డేట్ ఎలా ఉండాలి అనే ప్రశ్నకు ఇలియానా స్పందన ఆసక్తికరంగా ఉంది. ‘బీచ్ ఒడ్డున ఒక పిక్నిక్ బాస్కెట్, ఒక బ్లాంకెట్. పక్కనే వెచ్చదనం కోసం బోన్ ఫైర్. నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటూ...అద్భుతమైన ఫుడ్, వైన్ తీసుకుని తీయటి కబుర్లు చెప్పుకోవాలి. ఈ క్రమంలో రసరమ్యమైన సెక్స్ పొందాలి' అంటూ ఇలియానా సమాధానం ఇచ్చింది.

ఇతర విషయాల గురించి చెబుతూ...‘ఒక మనిషిని నువ్వు నిజంగా ప్రేమిస్తే...అతను కూడా నిన్ను అంతగానే ప్రేమించే వాడు అయితే ఆ అమ్మాయి లక్కీ గర్ల్ అవుతుంది. ప్రేమికుల మధ్య సెక్స్ జరుగడం సాధారణమే. కానీ సెక్స్ జరిగినంత మాత్రాన వారి మధయ నిజమైన ప్రేమ ఉన్నట్లు కాదు' అంటోది ఇలియానా.


{[['']]}
 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved