A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » నగ్న పోస్టర్ పై సిద్దార్ద స్పందన

నగ్న పోస్టర్ పై సిద్దార్ద స్పందన

{[['']]}



బాలీవుడ్‌ అగ్రనటుల్లో అమీర్‌ఖాన్‌కు ప్రత్యేక స్థానముంది. ఆయన తాజా చిత్రం 'పీకే'. ఇందులో ఓ సన్నివేశంలో అర్ధనగ్నంగా నటిస్తున్నారు. ఆ ఫొటోను కూడా ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి.. 'నేనెలా ఉన్నానో చెప్పండ' అంటూ అభిమానులను అడిగారు. దీనిపై పలువురు అభ్యంతరం చెబుతున్నారు.

హీరో సిద్ధార్థ్‌ స్పందిస్తూ... ''కళకు ఏదీ అతీతం కాదు. అర్ధనగ్నంగా నటించడం కూడా ఒక కళ. అమీర్‌ ఫొటోను అశ్లీలమని చెప్పలేం. ఒలింపిక్స్‌లో ఈత పోటీల్లో స్విమ్‌సూట్‌ వేసుకుంటారు. వాటిని చూసి ఎవ్వరూ అలా డ్రస్సులు వేసుకోవడం లేదు. కళాకారులకు, కథా రచయితలకు పూర్తి స్వాతంత్య్రం ఇవ్వాలి. అప్పుడే ప్రభంజనాలకు చోటుంటుంది. నిషేధం, కేసు.. అనుకుంటూ వెళ్తే ఏ మంచి సినిమానూ తెరపైకి తీసుకురాలేరు''ని పేర్కొన్నారు.




Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved