A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » సౌందర్యలహరి'లో శ్రీదేవి ఆమెతో పాటు ఆమె వీరాభిమాని రామ్‌గోపాల్‌వర్మ పాల్గొన్నారు. ?

సౌందర్యలహరి'లో శ్రీదేవి ఆమెతో పాటు ఆమె వీరాభిమాని రామ్‌గోపాల్‌వర్మ పాల్గొన్నారు. ?

{[['']]}


శ్రీదేవి ని టీవీ షోలలో చూడాలని, చూపించాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ తెలుగు వరకూ అది ఎప్పుడూ సాధ్యం కాలదు. అయితే తొలిసారిగా ఆమె తెలుగులో ఓ టీవి షో లో కనిపించనుంది. అదీ మరెవరి షో నో కాదు...దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పోగ్రామ్..సౌందర్య లహరిలో. రాఘవేంద్రరావుతో ఏ హీరోయిన్ చేయని విధంగా ఏకంగా 24 సినిమాలు చేశారు శ్రీదేవి. మరి వీరిద్దరి మధ్య జరిగిన విషయాలు, అనుభవాలు ఎంతో ఆసక్తికరం అంటున్నారు అబిమానులు. వీటన్నింటికి వేదికైంది 'సౌందర్యలహరి'. టీవీ షోలలో ప్రత్యేకం అనిపించుకుంటున్న 'సౌందర్యలహరి' కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీదేవి విచ్చేశారు.

ఈ షో లో... 'సౌందర్యలహరి'లో ఆమెతోపాటు ఆమె వీరాభిమాని రామ్‌గోపాల్‌వర్మ పాల్గొన్నారు. ? అలాగే బోనీకపూర్‌- శ్రీదేవిల వివాహానికి ఒక విధంగా రాఘవేంద్రరావు కారణమని శ్రీదేవి చెప్పారు. శ్రీదేవి బాలనటిగా నటించిన కొన్ని సినిమాలకు రాఘవేంద్రరావు సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ రోజుల గురించి రాఘవేంద్రరావు ఏమన్నారు? అనేది ప్రత్యేకంగా చెప్పనుంది.

'సౌందర్యలహరి'లో అందరూ చర్చిస్తున్న అంశం రాఘవేంద్రరావుగారు పళ్లు, పువ్వులు, నాభి ని ఎక్కువగా చూపిస్తుంటారని. మరి దీనిగురించి శ్రీదేవి ఏమడిగారు అనేది ఆసక్తికరమే. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు 50 వసంతాల దర్శక అనుభవాన్ని వివరించేలా సాగుతున్న ఈ వేదిక అతిలోక సుందరి శ్రీదేవి రాకతో మరింత కాంతులీనింది. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ ప్రముఖ తారగా వెలుగొందుతున్న శ్రీదేవి తొలిసారిగా పాల్గొన్న టీవీ షో'సౌందర్యలహరి' కావడం విశేషం.

'పదహారేళ్లవయసు'తో నాయికగా తెలుగు తెరకు పరిచయం చేసి, 'హిమ్మత్‌వాలా'తో హిందీ ప్రేక్షకులకు దగ్గర చేసిన దర్శకుడి గురించి అనేక విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి.. ఇలా స్టార్ హీరోలతో తన నటనా అనుభువాల్ని చెప్పారు. వీటన్నింటి సమాహారంగా ఈ కార్యక్రమం త్వరలో 'ఈటీవీ'లో ప్రసారమవుతుంది.
Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved