A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » 'స్కాచ్' మందు సీనుపై వివరణ ఇచ్చిన కాజల్ అగర్వాల్!

'స్కాచ్' మందు సీనుపై వివరణ ఇచ్చిన కాజల్ అగర్వాల్!

{[['']]}రాంచరణ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం "గోవిందుడు అందరివాడేలే". ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటించింది. ఓ సన్నివేశంలో కాజల్ స్కాచ్‌ మందును రెండు మూడు పెగ్గులు లాగిస్తుంది. దీంతో ఈ అమ్మడుకు మందు అలవాటు ఉందనే అనుమానం ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిలో కలిగింది. ఈ మాటలు హీరోయిన్ చెవిలో పడ్డాయి. ఇంకేముంది.. ఆ మందు సీనుపై ఈ అమ్మడు వివరణ ఇచ్చుకుంది.

ఆ వివరణ ఏమిటంటే... అసలు తానెప్పుడూ మందు అన్నది ముట్టలేదని, పబ్బులకు వెళతాను కానీ, అక్కడ కేవలం ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకుంటానని చెప్పుకొచ్చింది. తనకు అలాంటి అలవాట్లు లేవు. ఈ సినిమాలో అలాంటి మందు కొట్టే సీను ఉందని దర్శకుడు ముందే చెప్పారు.

నేను తటపటాయిస్తే, ఈవేళ అమ్మాయిలు మందు కొట్టడం చాలా కామన్' అంటూ ఆయన నన్ను కన్విన్స్ చేశారు. అందుకే, ఆ సీన్ చేశాను. నేను మాత్రం పబ్స్‌కి వెళ్ళినా జస్ట్ ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకుంటాను. అయినా, సినిమాల్లో చేసేవన్నీ నిజజీవితంలో జరగవు. అందుకే, దీనిని ఎవరూ స్ఫూర్తిగా తీసుకోరాదంటూ కాజల్ వివరణ ఇచ్చింది. 

Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved