A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్‌ లో 'ఐ' వివాదం

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్‌ లో 'ఐ' వివాదం

{[['']]}



టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్‌ లో కోలీవుడ్‌ టాప్ డైరెక్టర్‌ శంకర్‌, వైవిద్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే హీరో విక్రమ్‌ కాంబినేషన్ లో వచ్చే 'ఐ' సినిమాపై పెద్ద వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది.  మనదేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 భారీ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్ నిర్మాతగా 180 కోట్ల రూపాయలతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఎమిజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.  సినీ దిగ్గజాలతో పాటు సాధారణ ప్రేక్షకులు  కూడా ఎప్పుడెప్పుడా అని ఈ మూవీ రిలీజ్ కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల తెలిసిన సమాచారం ప్రకారం  సంక్రాతికి ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నిరాశపరిచే విధంగా ఉండనుంది.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved