A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » మోసం చేసిన మహిళపై జాలి చూపిన నటుడు అలీ..

మోసం చేసిన మహిళపై జాలి చూపిన నటుడు అలీ..

{[['']]}సినీ నటుడు అలీ ఓ కేసు విషయంలో పెద్ద మనసు ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. జాతీయ రెండో మెగా లోక్ అదాలత్ లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పలు కేసులు పరిష్కరించే కార్యక్రమం జరిగింది. ఇందులో అలీ వేసిన కేసు కూడా ఉంది.

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన సాంబశివరావు, శకుంతల దంపతుల ఇంటిని 1998లో అలీ కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటిపై సాంబశివరావు దంపతులు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.90 లక్షల రుణం తీసుకున్నారు. ఈ సంగతి చెప్పకుండానే ఇంటిని విక్రయించారు. బ్యాంకు అధికారుల ద్వారా ఆలస్యంగా ఆ విషయాన్ని తెలుసుకున్న అలీ... 2006లో వారిద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో చీటింగ్ కేసు నమోదైంది.

 అయితే సదరు వ్యక్తి చనిపోవడంతో రెండో ముద్దాయిగా ఉన్న అతని భార్యపై కేసు నడుస్తోంది. భర్త చనిపోయిన తర్వాత ఆమె దయనీయ స్థితిలో ఉండటంతో ఆ కేసును వెనక్కి తీసుకున్నారు అలీ.

లోక్ అదాలత్ లో నిందితుల నుంచి తమకు రావాల్సిన డబ్బు తీసుకొని కక్షిదారులు రాజీ అవుతుండగా..అలీ మాత్రం తనకు రావల్సిన డబ్బును వదులుకొని పెద్ద మనసుతో కేసును ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించిన అలీని న్యాయమూర్తులు అభినందించారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు ముందుకొచ్చి కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved