A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » అభిమాని వికృత చేష్ట

అభిమాని వికృత చేష్ట

{[['']]}ట్విట్టర్, ఫేస్ బుక్ వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు ఆకతాయిల బెడద ఎక్కువయిపోయింది. తమ అభిమానులకు దగ్గరయ్యేందుకు దారిగా సెలబ్రిటీలు ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఎంచుకుంటుంటే, వాటిలో తమ వికృత చేష్టలు చూపిస్తున్నారు మరికొందరు. తాజాగా ఇలాంటిదే హాయ్ చిత్రం ఫేమ్ నిఖితకు కూడా జరిగిందట.

ఆమె ట్విట్టర్ పేజీలో నిఖిత ఫోటోను మార్ఫింగ్ చేసి ఆమె ఎద సంపదను ఎక్కువ చేసి ఉన్నట్లున్న ఫోటోను ఓ ఆకతాయి పెట్టేశాడట. దాంతో ఆమె ఫాలోయర్స్ నిజంగా ఈ ఫోటోను నిఖితే పెట్టిందేమోనన్న సందేహంలో కొందరు ట్వీట్లు ఇచ్చుకున్నారట.

ఐతే ఇంతలో విషయం నిఖితకు చేరేసరికి ఆ ఫోటోలను వెంటనే తొలగించేసిందట ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి సమస్య తనకు మాత్రమే కాదనీ, ఇంకా చాలామంది ఇలాంటివారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయిందట. అందుకనే ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలుంటే సరిపోదు.. వాటిని చెక్ చేసుకుంటూ ఉండాలి మరి.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved