A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » అంతా సీక్రెట్: ఆహుతి ప్రసాద్ ఆరోగ్యంపై సమాచారం లేదు

అంతా సీక్రెట్: ఆహుతి ప్రసాద్ ఆరోగ్యంపై సమాచారం లేదు

{[['']]}



ఆహుతి' చిత్రాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న  సినీ నటుడు ఆహుతి ప్రసాద్ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు పెదవి విప్పటం లేదు. కాగా ఆహుతి ప్రసాద్.. సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఇంతకీ  అనారోగ్యం ఏమిటనేది ...ఆహుతి ప్రసాద్  కుటుంబ సభ్యులు గోప్యత పాటిస్తున్నట్లు ఆయనతో సన్నిహితంగా ఉండే ఒకరు తెలిపారు. '

ఆహుతి ప్రసాద్ కు ఫోన్ చేసినా... నాన్న బిజీగా ఉన్నారని ఆయన కుమారుడు సమాధానం ఇస్తున్నారని, అయితే అసలు విషయం తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లితే...ఆహుతి ప్రసాద్ బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని' ఆయన పేర్కొన్నారు. కాగా  ఆహుతి ప్రసాద్ కేన్సర్ తో బాధపడుతున్నారని, ఆయన రెండు నెలలుగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved