A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » ప్రాణాలు లెక్కచేయని రజనీ ఫ్యాన్; ‘లింగా’ చూస్తూ మృతి

ప్రాణాలు లెక్కచేయని రజనీ ఫ్యాన్; ‘లింగా’ చూస్తూ మృతి

{[['']]}


సౌతిండియాలో రజనీకాంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అభిమానంతో ఒక్కోసారి ఫ్యాన్స్ చేస్తున్న పనులు చూసే వారికి బాధన కలిగిస్తున్నాయి. తాజాగా రజనీకాంత్ అభిమాని ఒకరు ‘లింగా' సినిమా చూస్తూ ప్రాణాలు వదిలాడు. తమిళనాడులోని చెట్టిపాళ్యం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ (56) అనే వ్యక్తి రజనీకాంత్ వీరాభిమాని.


రజనీ సినిమా విడుదలైన వెంటనే చూడటం ఆయనకు అలవాటు. గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతుండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో ఉండటం వల్ల ఇటీవల విడుదలైన రజనీకాంత్ ‘లింగా' చిత్రం చూడలేక పోయాడు. అతను వెళ్లాలనుకుంటున్నా...ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగా వైద్యులు, కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.

అయితే సినిమా చూడాలనే కోరిక ఆపుకోలేని రాజేంద్రన్....గవర్నమెంటు ఆసుపత్రి నుండి తప్పించుకుని సమీపంలో కిలోమీటర్ దూరంలో ఉన్న థియేటర్లో లింగా సినిమాకు వెల్లాడు. సినిమా పూర్తయినా రాజేంద్రన్ అలాగే సీట్లో ఉండి కనబడటంతో థియేటర్ సిబ్బంది వచ్చి చూడగా...అతను చనిపోయినట్లు గుర్తించారు.

అతని చేతికి సెలైన్ ట్యూబ్ అలాగే ఉండటాన్ని చూసి సిబ్బంది ఆసుపత్రి నుండి వచ్చినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తమిళనాడు రజనీకాంత్ ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. రాజేంద్రన్‌ను విషయం రజనీకాంత్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన వచ్చిన రాజేంద్రన్ కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉంది.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved