A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » అక్కినేని అఖిల్ తొలి చిత్రానికి హీరోయిన్ దొరికిందోచ్!

అక్కినేని అఖిల్ తొలి చిత్రానికి హీరోయిన్ దొరికిందోచ్!

{[['']]}అక్కినేని అఖిల్ తొలి చిత్రానికి హీరోయిన్ దొరికింది. యువ సామ్రాట్ నాగార్జున రెండో తనయుడు అఖిల్ అక్కినేని త్వరలోనే వెండితెర అరంగేట్రం చేయనున్నారు. ఆయన సరసన నటించే కొత్త హీరోయిన్ కోసం అనేక మంది అందగత్తెల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ పేర్ల పరిశీలనలో కూడా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు. వాస్తవానికి అనేక మంది పేర్లు ప్రచారంలో వచ్చినప్పటికీ.. వాటిలో ఏ ఒక్క పేరును ఎవరూ కూడా ధృవీకరించలేదు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ అమీర దస్తూర్‌ని ఈ సినిమాకి హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. 'ఇసాకి' అనే సినిమా ద్వారా ఈ ఇరవై ఒక్కేళ్ల చిన్నది బాలీవుడ్‌కి పరిచయమైంది. ప్రస్తుతం తమిళంలో కేవీ ఆనంద్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. అఖిల్ పక్కన ఈమె ఎంపిక దాదాపు పూర్తయిందనీ, ఇక ఆమె పేరు ప్రకటించడం లాంఛనమేనని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved