A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » అఖిల్‌ అక్కినేని హీరో... వి.వి.వినాయక్‌ దర్శకత్వం... నితిన్‌ స్వంత చిత్రం

అఖిల్‌ అక్కినేని హీరో... వి.వి.వినాయక్‌ దర్శకత్వం... నితిన్‌ స్వంత చిత్రం

{[['']]}కింగ్‌ నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేని హీరోగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై యూత్‌స్టార్‌ నితిన్‌, ఎన్‌.సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్‌ ముహూర్తం డిసెంబర్‌ 17 ఉదయం 9.10 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. శ్రీమతి అమల అక్కినేని క్లాప్‌నివ్వగా, యువసామ్రాట్‌ నాగచైతన్య కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కింగ్‌ నాగార్జున ఫస్ట్‌ షాట్‌ డైరెక్షన్‌లో ముహూర్తం షాట్‌ని అఖిల్‌ అక్కినేనిపై చిత్రీకరించారు. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరి మొదటివారంలో ప్రారంభం అవుతుంది.

అభిమానుల సమక్షంలో రెగ్యులర్‌ షూటింగ్‌
ఈ సందర్భంగా నిర్మాత నితిన్‌ మాట్లాడుతూ - ''ఈరోజు మంచి ముహూర్తం వుండటం వలన తొలి షాట్‌ చిత్రీకరించాం. జనవరి మొదటివారంలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. అఖిల్‌ సరసన నటించే కొత్త హీరోయిన్‌ కోసం అన్వేషిస్తున్నాం. దిల్‌తో నా కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ ఇచ్చిన వి.వి.వినాయక్‌గారి డైరెక్షన్‌లో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. అఖిల్‌ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం మా బేనర్‌లో చెయ్యడం ఎంతో ఆనందంగా వుంది. ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించే అద్భుతమైన సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తాం'' అన్నారు.

ఒక్క గంటలో 2 లక్షల క్లిక్స్‌
నిర్మాత ఎన్‌.సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ - ''నాగార్జునగారు అఖిల్‌ ఫస్ట్‌ పిక్చర్‌ చేసే అవకాశం మా సంస్థకు ఇవ్వడం ఆనందంగా వుంది. వి.వి.వినాయక్‌గారు ఈ సినిమాచా చాలా పెద్ద స్థాయిలో ప్లాన్‌ చేశారు. ఈ చిత్రం ముహూర్తం షాట్‌ తీసినట్లు అఖిల్‌, నితిన్‌లు ట్విట్టర్‌లో పెట్టగానే ఒక్క గంటలో 2 లక్షల క్లిక్స్‌ వచ్చాయంటే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్‌ వుందో తెలుస్తోంది. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ధీటుగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే అన్ని వివరాలూ తెలియజేస్తాం'' అన్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved