A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » కేసీఆర్ చేతులు మీదుగా బిగ్ బికి అక్కినేని పురస్కారం

కేసీఆర్ చేతులు మీదుగా బిగ్ బికి అక్కినేని పురస్కారం

{[['']]}బాలీవుడ్‌ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు చేతులు మీదుగా అక్కినేని జాతీయ పురస్కారం అందుకున్నారు. శనివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. అంతకుముందు కేసీఆర్ ను అమితాబ్‌ మర్యాదపూర్వకంగా సీఎం అధికారిక నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా అక్కినేని పురస్కారం అందుకోనున్న అమితాబ్‌కు కేసీఆర్‌ అభినందనలు తెలుపగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించి అధికారంలోకి వచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు బిగ్‌ బికి శుభాభినందనలు తెలియజేశారు.

అమితాబ్‌ వెంట ప్రముఖ టాలీవుడ్ నటుడు, అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు. ఏఎన్నార్ అవార్డు కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులంతా పాల్గొని అమితాబ్ ను ఘనంగా సత్కరించారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved