A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » యాంకర్ అనసూయ సినిమాల్లోకి వస్తోంది!

యాంకర్ అనసూయ సినిమాల్లోకి వస్తోంది!

{[['']]}యాంకర్‌గా తక్కువ కాలంలో కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ అనసూయ. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారభించి....జబర్దస్త్ షోతో పాపులర్ అయి, ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు ఆ మధ్య అత్తారింటికి దారేది, రేసు గుర్రం లాంటి చిత్రాల్లో ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే అప్పట్లో ఆమె ఏ ఆఫర్ కూడా ఒప్పుకోలేదు. మా హీరో సినిమా తిరస్కరిస్తావా? అంటూ ఆ మధ్య పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ వాగ్వివాదానికి దిగితే వారితో సోషల్ మీడియాలో గొడవ కూడా పెట్టుకున్నారు. ఆ మధ్య ఇదో హాట్ టాపిక్ అయింది. ఆ సంగతి పక్కన పెట్టి తాజా విషయానికొస్తే ఆమె ఓ సినిమాకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

థ్రిల్లర్ జేనర్లో తెరకెక్కబోయే చిత్రంలో ఆమె నటించబోతోంది. ఈ చిత్రం ద్వారా రవికాంత్ పేరెపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అనసూయ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. తొలుత ఆమె ఈ పాత్ర ఒప్పుకోవడానికి సందేహించిందని, స్ర్కిప్టు విన్న తరువాత ఒప్పుకోకుండా ఉండలేక పోయిందని టాక్.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved