A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » మళ్లీ ఆస్కార్ అవార్డుల నామినేషన్ బరిలో ఏ.ఆర్.రెహ్మాన్!

మళ్లీ ఆస్కార్ అవార్డుల నామినేషన్ బరిలో ఏ.ఆర్.రెహ్మాన్!

{[['']]}భారత సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహ్మాన్ మళ్లీ ఆస్కార్ అవార్డు నామినేషన్ బరిలో నిలిచారు. గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్ అనే చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్‌గా ఎంపికై ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెల్సిందే.

ఈ యేడాది కూడా రెహ్మాన్ సంగీతం సమకూర్చిన మూడు చిత్రాలు ఆస్కార్ అవార్డు నామినేషన్ బరిలో నిలిచాయి. వీటిలో 'కొచ్చాడయాన్', 'మిలియన్ డాలర్ ఆర్మ్', 'ద హండ్రెడ్ పుట్ జర్నీ' సినిమాలు ఉన్నాయి.

87వ ఆస్కార్ అవార్డుల కేటగిరిలో ఈ మూడు సినిమాలకూ నామినేషన్లు దక్కాయి. ఈ దఫా కూడా ఆస్కార్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా రహమాన్ నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. 

Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved