A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » అదిరింది : బాలయ్య ‘లయన్’ ఫస్ట్ లుక్ (ఫోటో)

అదిరింది : బాలయ్య ‘లయన్’ ఫస్ట్ లుక్ (ఫోటో)

{[['']]}


బాలయ్య ప్రస్తుతం సత్య దేవ దర్శకత్వంలో ‘లయన్'(ఇంకా ఖరారు కాలేదు) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. పుల్ మాస్ లుక్ లో బాలయ్య గెటప్ అదిరి పోయింది. ఫస్ట్ లుక్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రంలో బాలయ్య సరసన త్రిష, రాధికా ఆప్టే రొమాన్స్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, ఆలీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను పారిశ్రామికవేత్త రమణారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్న చిత్ర యూనిట్ గతంలో గాడ్సే వారియర్ అనుకున్నారు.

కానీ ఆ టైటిల్స్ బాలయ్య ఇమేజ్ కు తగిన విధంగా లేక పోవడంతో ‘లయన్ ' పేరు ఓకే చేసారు. టైటిల్ లో సింహం కలిస్తే బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ తో ఈ టైటిల్ నే ఖరారు చేస్తారని సమాచారం. సంక్రాంతి కి విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved