A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » అభిమాని కోసం: మొన్న పవన్, నేడు బాలయ్య (ఫోటో)

అభిమాని కోసం: మొన్న పవన్, నేడు బాలయ్య (ఫోటో)

{[['']]}


క్యాన్సర్‌తో బాధ పడుతున్న తన అభిమాని కోరిక మేరకు ఇటీవల పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆమెను కలిసిన సంగతి తెలిసిందే. స్వయంగా తన అభిమాన హీరో వచ్చి మోరల్ సపోర్టు ఇవ్వడంతో....అనుకున్న సమయం కంటే ముందుగానే రికవర్ అయింది శ్రీజ. తాజాగా నందమూరి నట సింహం బాలయ్య కూడా....తనను చూడాలని పరితపించిన శ్రావణి అనే 12 ఏళ్ల అభిమాని కోసం ఆసుపత్రికి వెళ్లి కలిసారు.

తన మోరల్ సపోర్టు ఇచ్చారు. శ్రావణి గత రెండేళ్లుగా లుకేమియాతో బాధ పడుతోంది. రెండు సంవత్సరాలుగా కోమాలో ఉంది. ఇటీవలే కోమా నుండి బయటకు వచ్చిన శ్రావణి...తన అభిమాన హీరో బాలయ్యను చూడాలని కోరింది.

ఈ విషయం బాలయ్యకు చేరడంతో వెంటనే ఆయన స్పందించి ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. బాలయ్య మోరల్ సపోర్టుతో శ్రావణి పూర్తి కోలుకుంది. బాలయ్య గత కొన్ని రోజులుగా బసవ తారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే. తాను కూడా బాలయ్యతో పాటు క్యాన్సర్ అవేర్ నెస్ కార్యక్రమంలో పాల్గొంటానని పేర్కొంది.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved