A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » లైఫ్ లో బెస్ట్ డే : పవన్ కళ్యాణ్ ఐ లవ్ యు చెప్పారు

లైఫ్ లో బెస్ట్ డే : పవన్ కళ్యాణ్ ఐ లవ్ యు చెప్పారు

{[['']]}


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయనతో సినిమా చేయాలని దాదాపుగా ప్రతి దర్శకుడు, టెక్నీషియన్ కోరుకుంటారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తో పని చేసే అవకాశం దక్కించుకున్న సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తన అనుభవాలను పంచుకున్నారు.

అనూప్ రూబెన్స్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గోపాల గోపాల' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా అనూప్ రూబెన్స్ పని తీరు చూసి ప్రశంసించారట పవన్ కళ్యాణ్. ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ నన్ను పిలిచి...ఐ లవ్ యు అనూప్, త్వరలోనే మనం కలిసి పని చేస్తాం అన్నారు. నా లైఫ్ లో ఇది బెస్ట్ డే' అంటూ అనూప్ తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడించారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved