A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » మా ఆవిడ అంటూ సల్మాన్ - విక్రమ్ వాదన: నవ్వులు

మా ఆవిడ అంటూ సల్మాన్ - విక్రమ్ వాదన: నవ్వులు

{[['']]}

సంక్రాంతి సందర్భంగా శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘ఐ' చిత్రం తమిళం, తెలుగు, హిందీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ ప్రమోషన్లో భాగంగా ‘ఐ' టీం సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ....నా మిత్రుడు విక్రమ్ ప్రతి సినిమాకు తనను తాను మార్చుకుంటున్నాడు.

అతని రూపం, బాడీ ఒక్కో సినిమాలో ఒక్కోలా ఉంటుంది. అలా సాధ్యమో ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది అని వ్యాఖ్యానించారు. దీనికి విక్రమ్ సమాధానం ఇస్తూ...మీరేమో ఇలా అంటున్నారు. మా ఆవిడేమో మీలా తయారవమంటోంది అన్నారు. దీనికి సల్మాన్ రిప్లై ఇస్తూ రేపు పెళ్లయితే మా ఆవిడ విక్రమ్ లా తయారవమంటుందేమో అంటూ కౌంటర్ వేసాడు. వీరి సంబాషణ ప్రేక్షకుల్లో నవ్వులు పూయించింది.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved