A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » తమ్ముడి ఆత్మహత్య గురించి హీరోయిన్ కేథరిన్

తమ్ముడి ఆత్మహత్య గురించి హీరోయిన్ కేథరిన్

{[['']]}


ఇద్దరమ్మాయిలతో, పైసా, ఎర్రబస్సు చిత్రాల హీరోయిన్ కేథరిన్ థెరిస్సా సోదరుడు క్రిస్టోఫర్ ఇటీవల బెంగుళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. సోదరుడి మరణంతో కేథరిన్ విషాదంలో మురిగిపోయింది. ఇప్పుడిప్పుడే ఆమె ఆ షాక్ నుండి తేరుకుంటోంది. తాజాగా ఆమె ఈ విషయమై స్పందించారు.

మా ఫ్యామిలీలో క్రిస్టోఫర్ అందరికంటే చిన్నవాడు. కొన్ని రోజులుగా ఇంట్లో వాళ్లు ఏం చెప్పినా వినడం లేదు. చదువుపై కూడా ఆసక్తి తగ్గింది. టీనేజీలో ఇలాంటి ప్రవర్తన సాధారణమే అని అంతా అనుకున్నాం. కొంతకాలంగా ఎవరితో మాట్లాడటం లేదు. ఇందలోనే ఇలా జరుగడం అందరినీ షాక్ కు గురి చేసింది అని కేథరిన్ వెల్లడించింది. బాధలో ఉన్న తనకు అందరూ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. వారి ఓదార్పును ఎప్పటికీ మరిచిపోలేను అని ఆమె వెల్లడించారు.

క్రిస్టోఫర్ బెంగులూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బి.కాం చదువుతున్నాడు. గత కొంతకాలంగా అతను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడని, ఆ కారణంగా చదువు కొనసాగించలేని పరిస్థితి ఎందని, ఈ నేపథ్యంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అతని స్నేహితులు చెబుతున్నారు.


బెంగుళూరులోని మురుగేష్ పాళ్యా ప్రాంతంలోని తన రూంలో క్రిస్టోఫర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు క్రిస్టోఫర్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఫైనాన్సియల్ సమస్యల కారణంగా విద్యార్థి దశలోనే క్రిస్టోఫర్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశం అయింది.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved