A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » చక్రి మేనేజర్‌ ఏమయ్యాడు... ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్... ఏంటి సంగతి...?!!

చక్రి మేనేజర్‌ ఏమయ్యాడు... ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్... ఏంటి సంగతి...?!!

{[['']]}చక్రి మేనేజర్ ఒకరు కనబడుటలేదట. ఫోన్ చేస్తే స్విచాఫ్‌లో ఉన్నట్లు ఫిలిమ్ నగర్‌లో చెప్పుకుంటున్నారు. సినీ సంగీత దర్శకుడు చక్రికి మేనేజర్లుగా వ్యవహరించే ఇద్దరు వ్యక్తులు వుండేవారు. ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసి అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసి వారే ముందు నుండి నడిపారు. అందులో ఓ వ్యక్తి ఫ్యాన్స్‌ పనులు చూస్తే, మరో అతను ఏ రికార్డింగ్‌కు వెళ్ళినా.. ముందుగా వారే హాజరయి పరిస్థితిని పరిశీలించేవారు. అయితే చక్రి మరణించాక అందరి దృష్టి చక్రి భార్య, కుటుంబ సభ్యులపై పడింది.

వ్యక్తిగతంగా ఎవ్వరికీ పెద్దగా అప్పులు, బాకీలు లేని చక్రికి... ఆయన మేనేజర్‌ కన్పించకుండా పోవడం ఆశ్చర్యంగా వుంది. పలువురు నిర్మాతలు అతనికి ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వస్తుందని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం. గత కొద్దిరోజులుగా చక్రి ఇంటిలో కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివిదాలు జరిగాయి. ఈ విషయాన్ని అతి సన్నిహితులకు మేనేజర్‌ చెప్పాడని తెలిసింది. ఆర్థికపరమైన లావాదేవీలు కూడా తనే చూసేవాడని కొందరంటున్నారు. అచ్చం చక్రికి మాదిరిగానే పొట్ట ముందుకు వచ్చి లావుగా వుండే ఆ వ్యక్తి అంటే ఇండస్ట్రీ అందరికీ పరిచయమే.

కాగా, బుధవారంనాడు మీడియా ముందుకు చక్రి భార్య శ్రావణి, కుటుంబసభ్యులు వస్తే... మేనేజర్‌ అస్సలు కన్పించలేదు. మామూలుగా ప్రముఖుల గురించి ఎటువంటి గొడవలు జరిగినా ముందుగా మేనేజర్‌ను ప్రశ్నించడం మామూలే. కానీ ఇక్కడ పరిస్థితి గమనించాడో ఏమో కానీ... అతడు కన్పించకుండా పోవడం చాలా ఆశ్చర్యంగా వుందని పలువురు చర్చించుకుంటున్నారు.

Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved