A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » చక్రి ఆఖరి మాట... ఎందుకో జగన్ అన్నయ్యను ఇవాళ చూడాలనుందిరా....!!

చక్రి ఆఖరి మాట... ఎందుకో జగన్ అన్నయ్యను ఇవాళ చూడాలనుందిరా....!!

{[['']]}సంగీత చక్రవర్తి చక్రి... అకాలమరణం జీర్ణించుకోలేనిది. ఆయనతో కలిసి పనిచేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్‌. అమ్మానాన్న తమిళ అమ్మాయికి మంచి బాణీలు ఇచ్చారు. తాజాగా ఇద్దరూ కలిసి ఓ సినిమాకు పనిచేస్తున్నారు. ఆ సందర్భంగా అర్థరాత్రి ఒంటిగంట వరకూ రికార్డింగ్‌ థియేటర్‌లో చక్రి పనిచేశారు.

చక్రి మరణంపై పూరీ స్పందిస్తూ... రాత్రి రికార్డింగ్ థియేటర్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ... మా ఆఫీస్‌ బాయ్‌తో.. ఎందుకో జగన్‌ అన్నయ్యను చూడాలనుందిరా! అన్నాడట... అలా తిరిగి ఇంటి వెళ్ళిన చక్రి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడని తెలిసి.. షాక్‌ అయ్యాను.. అంటూ పూరీ జగన్నాథ్‌ నివాళులర్పించారు.


అసలు నేను నిన్న నా సోదరుడు చక్రిని కలవాల్సి వుంది. దూరంగా వుండటంతో కలవలేకపోయాను. స్వంత బ్రదర్‌లా మెలిగేవాడు. ఇద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం .అద్భుతమైన సంగీతం అందించారు. తలచుకుంటేనే దు:ఖం పొంగుకొస్తుంది.. చివరి నిమిషంలో ఎందుకని ఆయన ఆ మాట అన్నాడో తలచుకుంటే.. ఏదో శక్తి అలా అనిపించింది అనిపిస్తుంది అంటూ బాధను వ్యక్తం చేశారు.

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యాక్టర్లు జీవిత రాజశేఖర్, శివారెడ్డి తదితరులు ఆయన నివాసానికి చేరుకున్నారు. చక్రి పేరిట సంగీత అకాడెమీని ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లితో పాటు నేతలు ప్రభుత్వాన్ని కోరారు. చ‌క్రి మ‌ర‌ణం తెలుగు సినిమా ప‌ర‌శ్ర‌మ‌కి తీవ్రమైన లోటు , చ‌క్రి ఆత్మ‌కి శాంతి చేకూర్చాలని కోరుకుంటూ అలానే వారి కుటుంబ స‌భ్యుల‌కి సంతాపాన్నితెలుపుతున్నాను అని అల్లు అర్జున్‌ అన్నారు. చ‌క్రి మ‌ర‌ణం జీర్ణించుకోలేనిది , చ‌క్రి ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ , వారి కుటుంబ స‌భ్యుల‌కి నా తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాను అని ద‌ర్శ‌కుడు మారుతి అన్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved