A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » శ్రావణి ఫిర్యాదు... అత్తారింటి నుంచి ప్రాణహాని... హెచ్చార్సీకి చక్రి భార్య

శ్రావణి ఫిర్యాదు... అత్తారింటి నుంచి ప్రాణహాని... హెచ్చార్సీకి చక్రి భార్య

{[['']]}తన అత్తారింటిపై దివంగత సంగీత దర్శకుడు చక్రి సతీమణి శ్రావణి మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)కి ఫిర్యాదు చేయడం ఇపుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. తన భర్త చక్రి కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణ హానీ ఉందని ఆమె చెప్పడమే కాకుండా హెచ్చార్సీలో పిర్యాదు కూడా చేశానని శ్రావణి తెలియజేశారు. చక్రి చనిపోయిన క్షణం నుంచి తనను మానసికంగా హింసిస్తున్నారనీ, తన రూంలోని కప్‌బోర్డుకు తాళం వేశారని ఆమె చెప్పారు.

చక్రి తల్లిదండ్రులు, ఆయన అక్కా చెల్లెళ్ళ నుంచి తనకు ప్రాణహాని వుందని సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి చెప్పడం ఇపుడు షాకింగ్ గా మారింది. సంగీత దర్శకుడు చక్రి మరణించిన తర్వాత ఈ రెండు రోజుల్లో జరిగిన సంఘటనలు, గొడవలు తనకు ప్రాణహాని వుందన్న భయాన్ని కలిగించాయని, అందువల్ల తాను మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. చక్రి ఉన్నన్నాళ్లు తమను ఎంతమాత్రం పట్టించుకోనివారు చక్రి చనిపోయాక వేధిస్తున్నారంటూ ఆమె వాపోయారు. చక్రి తరఫు మనుషుల వల్ల తనకు భవిష్యత్తులో ప్రాణహాని ఉందేమోనన్న భయంతోనే తాను హెచ్చార్సీని ఆశ్రయించినట్లు శ్రావణి వివరించారు.

Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved