A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ఆర్థిక ఇబ్బందుల్లో చక్రి, ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే...

ఆర్థిక ఇబ్బందుల్లో చక్రి, ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే...

{[['']]}


ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు చక్రి ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం సంగీత ప్రియులను, అభిమానులను తీవ్రమైన మనోవేదనకు గురి చేసింది. ఆయన మరణంతో ఆయన భార్య శ్రావణి ఒంటరిదయిపోయింది. చక్రిని ప్రేమ వివాహం చేసుకున్న శ్రావణి చక్రి మరణంతో కుంగి పోయింది. తాజాగా ఆమె సాక్షి ఇంటర్వ్యూలో చక్రి గురించి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

చక్రి లేని జీవితం వృధా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. చక్రి మరణానికి ముందు రోజు జరిగిన పరిణామాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ‘ముందురోజు సాయంత్రం వరకు చక్రి ఇంటిలోనే ఉన్నారు. మా నాన్న, తమ్ముడు వస్తే కబుర్లు చెప్పారు. సాయంత్రం బయటకు వెళ్లి ఎప్పటికో వచ్చారు. నువ్వు పడుకో, నేను బట్టలు మార్చుకుని వస్తాను అని చెప్పి...కాసేపు టీవీ చూసి రాత్రి రెండుగంటల ప్రాంతంలో పడుకున్నారు' అని తెలిపారు.

గురక ఆగి పోవడంతో అనుమానం పడుకున్న తర్వాత ఆయన సాధరణంగా గురక పెడతారు. కానీ ఆరోజు గురక శబ్దం వినిపించలేదు. అనుమానం వచ్చి ఆయన వైపు చూసాను. అప్పటికే ఆయన ఒంటిరంగు మారిపోయింది. ఎంత పిలిచినా పలకలేదు. ఒళ్లంతా చల్లబడి పోయింది. ఊపిరి ఆగి పోయింది. నా మనసు కీడు శంకించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. అప్పటికే నా చక్రి నన్ను విడిచి వెళ్లిపోయాడనే వార్త నన్ను పిచ్చిదాన్ని చేసింది అని శ్రావణి కన్నీరుమున్నీరయ్యారు.

కొంతకాలంగా ఒబెసిటీతో... ఆయన ఆరోగ్యం గురించి చాలా సార్లు హెచ్చరించాను. ఒబెసిటీతో చాలా ఇబ్బంది పడేవారు. 2010లోనే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నారు. కానీ అది రిస్క్ అని చెప్పడంతో చేయించుకోలేదు. కానీ ఒబెసిటీ సమస్య తీవ్రం కావడంతో ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టారు. సర్జరీకి కూడా రెడీ అయ్యారు. అయితే కొంతకాలం ఆగాలని కార్డియాలజిస్ట్ చెప్పడంతో వాయిదా వేసారు. ఈ వారంలోనే డాక్టర్ ను కలవాల్సి ఉంది. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయిందని శ్రావణి కన్నీరుమున్నీరయ్యారు.

ఆర్థిక ఇబ్బందులు.. కొంతకాలంగా కెరీర్ బాగోలేక ఇబ్బందులు పెరిగి పోయాయి. డిసెంబర్ 31న ఓ షో చేసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆయన నా దగ్గరకు వచ్చి ‘ఈ సమయంలో మనకి ఈ షో అవకాశం రావడం ఎంత అదృష్టమో తెలుసారా, మన దగ్గర అస్సలు డబ్బు లేవు. మొత్తం అయిపోయాయి. లక్కీగా ఇపుడిది వచ్చింది' అని సంతోషంగా అన్నారు. కానీ ఉన్నట్టుండి ఈ షో క్యాన్సిల్ అయింది. ఓ సినిమా అవకాశం కూడా వచ్చినట్లే వచ్చి చేజారి పోయిందని. ఈ పరిణామాలు ఆయన్ను డిప్రెషన్ కు గురి చేసాయని తెలిపారు శ్రావణి.

కుటుంబం కోసం, దాన ధర్మాల కోసం... ఆయన బోలెడన్ని సినిమాలు చేసారు, చాలా సంపాదించారని అంతా అనుకుంటారు. కానీ పెద్దగా వెనకేసిందేమీ లేదు. బ్యాంకు బ్యాలెన్సులూ, ఆస్తులూ లేవు. ఉన్నదల్లా ఒక ఇల్లు మాత్రమే. తన సంపాదన ఎక్కువగా కుటుంబం కోసం, దానధర్మాలు చేసేందుకు ఖర్చుపెట్టే వారు అన్నారు శ్రావణి.

చక్రి కలను నెరవేస్తాను... చక్రి లేని జీవితంపై నాకు ఆసక్తి లేదు. బ్రతకాలన్న కోరిక అంతకన్నా లేదు. కానీ నేను బితికి తీరాలి. చక్రి ఒక స్టూడియో పెట్టాలనుకున్నారు. ‘సీ స్టూడియోస్' అనే పేరుని కూడా రిజిస్టర్ చేయించారు. కానీ ఆయన కలనెరవేరకుండానే వెళ్లి పోయారు. ఆయన కల నెరవేరుస్తాను. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా చేసి తీరుతాను అన్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved