A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » పెళ్లి మ్యాటర్: దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పి చార్మి సెన్సేషన్

పెళ్లి మ్యాటర్: దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పి చార్మి సెన్సేషన్

{[['']]}


జీ తెలుగు‌లో ప్రసారం అవుతున్న ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా' ప్రోగ్రాం కు గెస్ట్‌గా వచ్చిన చార్మి పలు సెన్సేషన్ కామెంట్స్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్స్ లిస్టు‌లో అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన సెలెబ్రిటీ ఎవరని అడిగిన క్వశ్చన్‌కు చార్మి దేవి శ్రీ ప్రసాద్ పేరు చెప్పింది. గతంలో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న వార్తల నేపథ్యంలో ఆమె కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.

ఒక్క దేవిశ్రీ ప్రసాద్ గురించి మాత్రమే కాదు...ఇలియానా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇలియానాను మేకప్ లేకుండా అస్సలు చూడలేమంటూ వ్యాఖ్యానించింది. గతంలో ఇలియానా, చార్మి ...ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘రాఖీ' చిత్రంలో నటించిన సంగతి తెలిసింది.

ఇలియానా బక్కపలుచని సౌందర్యం ఇష్టపడని కొందరు చార్మి మాటలు నిజమే అని అంటుంటే.....ఇలియానా ఫ్యాన్స్ మాత్రం చార్మి ఇలా మరొకరి గురించి నెగెటివ్ కామెంట్స్ చేయడం తగదని అంటున్నారు. మరి చార్మి చేసిన కామెంట్ల విషయం ఇలియానా చెవిన పడ్డాయో? లేదో?


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved