A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » గోపాల గోపాల: రంగంలోకి దిల్ రాజు, జనవరి 1నే...

గోపాల గోపాల: రంగంలోకి దిల్ రాజు, జనవరి 1నే...

{[['']]}


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్‌గా నటించిన ‘గోపాల గోపాల' చిత్రం ఆడియో విడుదల జనవరి 3న అనే వార్తలు వినిపించినప్పటికీ తాజాగా జనవరి 1నే రిలీజ్ చేస్తారని అంటున్నారు. సినిమాలో ఉన్నది కేవలం 3 పాటలే కావడంతో సింపుల్‌గా ఆడియో వేడుక చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం నైజాం రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. ఎన్ఆర్ఏ బేసిస్ కింద రూ. 13.4 కోట్లకు ఆయన ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్‌' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved