A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » దిల్ రాజు అండతో కళ్యాణ్ రామ్ ఒడ్డున

దిల్ రాజు అండతో కళ్యాణ్ రామ్ ఒడ్డున

{[['']]}హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు తోడు ఉంటే ఇంక బెంగేం ఉంటుంది. అందుకే టాలీవుడ్ లో చిన్న,పెద్ద తేడా లేకుండా అంతా తమ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఆయన అన్ని సినిమాలు ఒప్పుకోరు. సెలక్టివ్ గా ఆయన తీసుకునే చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తూ ఉంటాయి.

 తాజాగా అలాంటి ఆఫర్ కళ్యాణ్ రామ్ కు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రా,నైజాం రైట్స్ మొత్తం మంచి రేటు కు దిల్ రాజు తీసేసుకున్నట్లు ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అలాగే నైజాం, కృష్ణా తన సొంత రిలీజ్ చేసుకుని మిగతా ఏరియాలను తను బిజినెస్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే కళ్యాణ్ రామ్ సొంత సినిమా కావటంతో పూర్తిగా రిస్క్ లేకుండా ఒడ్డున పడినట్లే అని చెప్పాలి. నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ‘పటాస్‌' చిత్రం షూటింగ్‌ పూర్తయింది.
ఈ సినిమా గురించి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘రొమాంటిక్‌ , యాక్షన్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సాయికార్తీక్‌ మంచి సంగీతాన్ని అందించారు. త్వరలో ఆడియోను, చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని తెలిపారు. కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ''యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. కథలో వినోదానికీ చోటుంది. భారీ హంగులతో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది'' అన్నారు. శ్రుతి సోధి పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది. చిత్రంలో కల్యాణ్‌రామ్‌ పోలీసు అధికారిగా కనిపిస్తారు. కథలో మలుపులు రక్తికట్టించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. మరో ప్రక్క టెంపర్‌' మీదన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాకు ఈ చిత్రం పోటీ వస్తుందా అనే అనుమానంలో నందమూరి అభిమానులు ఉన్నారు. టెంపర్‌ పోస్టర్‌ విడుదల చేసిన కొన్ని గంటలకే పటాస్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


కథ విషయానికి వస్తే అటు టెంపర్‌లోనూ ఇటు పటాస్‌లోనూ ఇద్దరూ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గెటప్‌లో కనిపిస్తుండడం విశేషం. టెంపర్‌ కన్నా ముందే పటాస్‌ విడుదల అయ్యే అవకాశం ఉందనే టాక్‌ వినబడుతోంది. చాల కాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బందులు పడుతున్న కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రంతోనైనా హిట్‌ సాధించాలనుకుంటున్నాడు. ఈ చిత్ర ఆడియో త్వరలో విడుదల చేసే ఆలోచనలో రామ్‌ ఉన్నారు. సాయికార్తీక్‌ సంగీతం సమకూర్చగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: సర్వేశ్‌ మురారి, సంగీతం: సాయి కార్తిక్‌, ఎడిటింగ్‌: తమ్మిరాజు, ఆర్ట్‌: ఎం.కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: పటాస్‌ వెంకట్‌, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved