A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » 22 కోట్ల అప్పు: రజనీకాంత్ ఆస్తులు వేలం

22 కోట్ల అప్పు: రజనీకాంత్ ఆస్తులు వేలం

{[['']]}సినీనటుడు రజనీకాంత్ ఆస్తులు వేలం వేయాలని ఎగ్జిమ్ బ్యాంక్ (Exim Bank) పేపర్ లో ప్రకటన ఇచ్చింది. రూ.22 కోట్లు చెల్లించనందుకుగానూ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. కాగా ఓ చిత్ర నిర్మాణం కోసం ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నారు.

రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ కు బ్యాంకు ఈ నోటీసులిచ్చింది. మీడియావన్ గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థకు రూ. 22.21 కోట్లరూపాయలను 2014 జూలైలోగా చెల్లించాల్సి ఉంది. దానికి లతా రజనీకాంత్ గ్యారంటర్ గా ఉన్నారు. అసలు, వడ్డీ ఏమీ చెల్లించకపోవడంతో బ్యాంకు నోటీసు ఇచ్చింది. తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరు తాలూకాలో రజనీకి ఉన్న ఎకరా 2.13 సెంట్ల భూమి ఈ బ్యాంకు తనఖాలో ఉంది. సౌందర్య దర్శకత్వంలో వచ్చిన కొచ్చాడయాన్ సినిమాను గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. అందులో రజనీకాంత్, దీపికా పదుకొనే నటించిన విషయం తెలిసిందే.

Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved