A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ఎన్టీఆర్ ను గౌరవిస్తూ గూగుల్ ఇలా...

ఎన్టీఆర్ ను గౌరవిస్తూ గూగుల్ ఇలా...

{[['']]}


విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా పేరొందిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తన జీవన, నట ప్రస్థానంలో ఎన్ని గౌరవాలు, సత్కారాలు అందుకున్నారు. తాజాగా ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎన్టీఆర్ ను ఘనంగా గౌరవించింది. ఎన్టీఆర్ పేరు మీద ఒక ప్రత్యేక ఫాంట్ ను తమ డేటాబేస్ లో చేర్చింది. సిలికాన్ ఆంధ్ర డెవలప్ చేసిన ఈ ఫాంట్ లను ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా డేటాబేస్ లో మరిన్ని తెలుగు ఫాంట్లు జోడించడానికి గూగుల్ ప్లాన్ చేస్తుంది. వీటిని నెటిజన్లు ఫ్రీగా ఉపయోగించవచ్చు. ఫాంట్ ల కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి.

http://www.google.com/fonts/earlyaccess

అలాగే...తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేస్తున్న సిలికానాంధ్ర ఈ ఫాంట్లను ఉపయోగించేందుకు ఉచితంగా అందిస్తోంది. ఎన్టీఆర్ తో పాటుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజి విద్యా శాఖ మంత్రి మండలి వెంకట క్రిష్ణా రావు (మండలి) పేరుతో కూడా ఫాంట్ విడుదల చేశారు. ఎన్టీఆర్ పేరుతో ఫాంట్ విడుదల చేయటం పట్ల నందమూరి ఫ్యాన్స్ తో పాటు, టాలీవుడ్ ప్రముఖులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved