A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » సగం సినిమా ఎలా? నిర్మాతలు మోసం చేసారు: శ్రీ

సగం సినిమా ఎలా? నిర్మాతలు మోసం చేసారు: శ్రీ

{[['']]}సగం పూర్తయిన సినిమాని రిలీజ్ చేస్తారా? 30 రోజుల టాకీ అని చెప్పి 17 రోజులే టాకీ తీసారు. ఇలాంటి సినిమాని ఎలా రిలీజ్ చేస్తారు?' అంటూ వివాదానికి తెరతీసారు హీరో శ్రీ. ఈ యువ హీరో నటించిన తాజా సినిమా ‘నారి నారి శ్రీ మురారి' నిర్మాతలు తనని మోసం చేసారని శ్రీ ఆరోపించారు.

హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ మాట్లాడుతూ...‘నిర్మాత ఆర్థిక సమస్యల వల్ల సగం రోజులు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ విషయాన్ని చాలా కాలం వరకూ చెప్పనేలేదు. మాట్లాడాలని ప్రయత్నించినా ఎవరూ స్పందించలేదు. ఎలాంటి సమాచారం లేకుండా సగం సినిమా ఆడియోని రిలీజ్ చేసి...ఈ నెల 13న రిలీజ్ అంటున్నారని తెలిపారు.

నిర్మాతకు ఫోన్ చేస్తే సంతృప్తికర సమాధానం లేదు. డబ్బింగ్ వేరేవాళ్లతో చెప్పించారు. పైగా నా పేరుతో టైటిల్ పెట్టారు. ఇదంతా షాక్‌కి గురి చేసింది. పై విషయాలేవీ కెరీర్ పై ప్రభావం పడకూడదని మీతో చెబుతున్నా. పంపిణీదారులు, బయ్యర్లు శాటిలైట్ రైట్స్ కొనుక్కునేవాళ్లు ఈ విషయాన్ని గమనించగలరు. కథ, కథనం లేకుండా సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర జయాపజయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు' అన్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved