A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » అక్రమ నిర్మాణాన్ని తొలగించిన హీరో వెంకటేశ్

అక్రమ నిర్మాణాన్ని తొలగించిన హీరో వెంకటేశ్

{[['']]}
 సినీ హీరో వెంకటేశ్ హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నంబర్-1లో తన ప్లాట్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్డును శనివారం స్వయంగా ఆయనే కూలీలను నియమించుకొని కూల్చివేయించారు.

ఫిలింనగర్‌లోని ప్లాట్ నంబర్-3లో వెంకటేశ్‌కు ఫ్లాట్ ఉంది. గత కొద్ది రోజులుగా ఈ ఫ్లాట్‌లో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతుండటంతో రెండు వారాల క్రితం జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

పక్షం రోజుల్లో వాటిని కూల్చివేయకపోతే తామే కూల్చివేస్తామని నోటీసులో హెచ్చరించారు. దీనికి స్పందించిన వెంకటేశ్ నోటీసు గడువుకు ఒక రోజు ముందే ఆక్రమణలను నేలమట్టం చేయించారు. నిర్మాణాలు కూల్చివేసిన ప్రాంతాన్ని ఫొటోలు తీయించి జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు అందించారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved