A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » జబర్దస్త్ 'నల్ల వేణు'పై దాడికి కారణమేమిటి?

జబర్దస్త్ 'నల్ల వేణు'పై దాడికి కారణమేమిటి?

{[['']]}గత కొద్దికాలంగా ఈటీవీ 'జబర్‌దస్త్‌' అనే ప్రోగ్రామ్‌ నిర్వహిస్తుంది. సాయి అనే ప్రొడక్షన్‌ మేనేజర్‌ దీన్ని డీల్‌ చేస్తున్నారు. యూత్‌ కమేడియన్లు అంతా నాలుగైదు గ్రూపులుగా ఏర్పడి ఒక్కోగ్రూప్‌లో కొంతమంది ఉండి ఆ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తారు. దీనికి ఆర్టిస్టులే స్క్రిప్టులను తయారు చేసుకుంటారు. రాసుకుంటారు.

అందులో భాగంగా ఈనెల 18న కల్లుకాంపౌండ్‌ అనే స్కిట్‌ చేశారు. అందులో ఎల్లమ్మ అనే ఆవిడ.. శనగలు, చీకులు, తీసుకుని రావాలి. కానీ దానికి సంబంధించిన వస్తువులు లేకపోవడంతో... కల్లు కుండనుపోలినదాన్ని తీసుకువచ్చిందనీ, ఆ పక్కనే కల్లుకు సంబంధించిన వస్తువులను కాళ్ళతో తన్నడం, పగలగొట్టడం జరిగింది. ఇదంతా నల్లవేణు ఆధ్వర్యంలో జరిగింది.

ఎల్లమ్మను గౌడకులస్థులు దేవతగా ఆరాధిస్తారు. అందువల్లే తట్టుకోలేక దాడులు చేసి ఉంటారని జబర్‌దస్త్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఓ నటుడు వ్యాఖ్యానించాడు. ఏదిఏమైనా ఇలా దాడి చేయడం కరెక్ట్‌ కాదన్నాడు.

దాడి ఎలాజరిగింది?
తెలంగాణకు చెందిన నటుడు నల్లవేణు. అందుకు తాము మీతో ఓ ప్రోగ్రామ్‌ చేయాలనుందని కొంతమంది గౌడ కులానికి చెందిన వారు వేణుకు ఫోన్‌చేసి.. అందుకు సంబంధించిన విషయాలు, రెమ్యునరేషన్‌ గురించి మాట్లాడుకుందాం రమ్మని ఆదివారం 10 గంటలకు ఆహ్వానించారు.

విశ్వసనీయ సమచారం ప్రకారం.... అప్పటికే వారంతా టీవీ 9కు చెందిన వారికి సమాచారం అందించారు. ఛానల్‌ టీమ్‌ ఆదివారం ఉదయం 8 గంటలకు వచ్చి కెమెరాలు ఎక్కడపెట్టాలో ఫిక్స్‌ చేశారు. దాదాపు 10 గంటలవుతుండగా కారులో నల్లవేణు రాగానే.. వెంటనే దాడి నిర్వహించారు. దాదాపు 50 మంది ఇందులో పాల్గొన్నారని సమాచారం. ఈ ఫూటేజ్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు చూశారు. దాడిలో పాల్గొన్నదని హైదరాబాద్‌కు చెందిన వారు తక్కువనీ. అంతా ఇతర ప్రాంతాలవారని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా, అసలు దాడి చేసింది.. గౌడ కులస్థులవారేనా... లేక.. ఈటీవీలో క్రేజ్‌ సంపాదిస్తున్న ఈ  ప్రోగ్రామ్‌పై పలు విమర్శలు కూడా వచ్చాయి. ఈ ప్రోగ్రామ్‌లు బూతుపాళ్ళు ఎక్కువగా ఉందనీ, కుటుంబాలతో చూడలేకపోతున్నామని దీన్ని ఆపేయాలని కొందరు సూచించారు కూడా. కానీ యూత్‌ బాగా ఇంట్రస్ట్‌గా చూడటం రేటింగ్‌ ఎక్కువగా ఉండటంతో దీన్ని కొనసాగించాలని ఈ టీవీ యాజమాన్యం నిర్ణయిం తీసుకుంది. 


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved