A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » విషాదం: జూ ఎన్టీఆర్‌కు జరిగిన స్పాట్లోనే జానకిరామ్..

విషాదం: జూ ఎన్టీఆర్‌కు జరిగిన స్పాట్లోనే జానకిరామ్..

{[['']]}హరికృష్ణ పెద్ద కుమారుడు, నిర్మాత అయిన నందమూరి జానకి రామ్ మరణంతో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్లగొడ జిల్లా మునగాల మండలం, ఆకుపాముల దగ్గర జాతీయ రాహదారిపై యూటర్న్‌ తీసుకుంటున్న ట్రాక్టర్‌ను, జానకిరాం ప్రయాణిస్తున్న టాటా సఫారీ(ఎపీ29బీడీ2323) బలంగా ఢీకొంది. 

కాగా....గతంలో జూ ఎన్టీఆర్ 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్ట వశాత్తూ ఎన్టీఆర్ ప్రాణాలు దక్కాయి. అప్పట్లో ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరగిన ప్రాంతంలోనే జానకి రామ్ కారు ప్రమాదానికి గురి కావడం గమనార్హం. ఈ విషయం నందమూరి అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

జానకీరామ్ స్వయంగా నడుపుతున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన యలమంచి వెంకన్న అనే రైతు ఆకుపాముల సమీపంలో వరి నారు కొనుగోలు చేశారు. నారును ట్రాక్టర్‌లో లోడ్‌ చేసి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. నిజానికి, తన ఊరు చేరుకునేందుకు విజయవాడ వైపు రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించి, యూటర్న్‌ తీసుకోవాల్సి ఉంది. రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతో, రాంగ్‌రూట్‌లో వస్తూ డివైడర్‌ వద్ద హైదరాబాద్‌ రోడ్డు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ట్రాక్టర్‌ ఇంజన్‌ ముందుకు వెళ్లింది. ట్రాలీ మాత్రం విజయవాడవైపు వెళ్లే రోడ్డుపై మిగిలింది. జానకిరాం సఫారీ ఈ ట్రాలీనే ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ వెంకన్నకు ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ దుర్ఘటన తర్వాత ఆయన సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved