A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » బాలీవుడ్ హీరోలు స్నానం కూడా చేయరు.. సౌత్ స్టార్స్ సూపర్: కత్రినా కైఫ్

బాలీవుడ్ హీరోలు స్నానం కూడా చేయరు.. సౌత్ స్టార్స్ సూపర్: కత్రినా కైఫ్

{[['']]}బాలీవుడ్ హీరోలపై కత్రినా కైఫ్ మండిపడ్డారు. వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో సౌత్ హీరోల ముందు బాలీవుడ్ హీరోలు దిగదుడుపేనని చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోలు కనీసం స్నానం కూడా చేయరని, ఇలాంటి వారితో ఇంటిమేట్ సీన్స్ చేయాలంటే నా బాధ వర్ణనాతీతమని చెప్పుకొచ్చింది.

బాలీవుడ్, సౌత్ హీరోల వ్యక్తిగత పరిశుభ్రతపై కత్రినా కైఫ్ మాట్లాడుతూ... బాలీవుడ్‌కు చెందిన కొంతమంది హీరోలున్నారు, కనీసం స్నానం కూడా చేయకుండా, మద్యం వాసనతోనే షూటింగ్స్‌కి వచ్చేస్తారు. రాత్రల్లా తాగి, పొద్దున్న అలాగే మంచం పై నుంచి లేచి షూటింగులకు వచ్చేస్తారు. కనీసం స్నానం చేయాలన్న కామన్ సెన్స్ కూడా వాళ్లకి వుండదు. అలాంటి హీరోలతో ఇంటిమేట్ సీన్స్ వుంటే కనుక ఇక నా బాధ వర్ణనాతీతమని వాపోయింది.

అంతేకాకుండా, వాళ్ల శరీర కంపుకి, నోటి కంపుకీ కడుపులో దేవేసి, వాంతి వచ్చినట్టు వుండేది. ఇలాంటి వాటిని మౌనంగానే భరించాను. అదే సౌత్ హీరోలైతే చాలా నీట్‌గా వుంటారు. వీరిని చూసి బాలీవుడ్ హీరోలు ఎంతో నేర్చుకోవాలని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఇంతకీ సదరు బాలీవుడ్ హీరోల పేర్లు చెప్పచ్చుగా? అంటే, "అమ్మో ... వద్దులెండి. మళ్లీ అదో పెద్ద ఇష్యూ అయిపోతుంది" అంటూ తన సంభాషణలను ఆపేసింది. 


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved