A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » పవన్, రజనీ కంటే...లీడింగులో మహేష్ బాబు!

పవన్, రజనీ కంటే...లీడింగులో మహేష్ బాబు!

{[['']]}ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ ప్రతి సంవత్సరం సెలబ్రిటీల సంపాదన వివరాల జాబితా బయట పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఇండియాలోని సంపాదనలో టాప్ 100లో ఉన్న సెలబ్రిటీల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అత్యధిక సంపాదనతో లీడింగులో ఉన్నారు. ఆయన సంవత్సరానికి 244.50 కోట్ల సంపాదనతో టాపులో ఉన్నారు.

ఆయన తర్వాతి స్థానల్లో అమితాబ్ బచ్చన్(196 కోట్లు), షారుక్ ఖాన్(202 కోట్లు), మహేంద్ర సింగ్(141 కోట్లు) లాంటి వారు ఉన్నారు. సౌత్ స్టార్స్ విషయానికొస్తే మహేష్ బాబు సంవత్సరానికి 51 కోట్ల సంపాదనతో 30 వస్థానంలో ఉన్నారు. ఈ విషయంలో ఆయన రజనీకాంత్, పవన్ కళ్యాణ్ లాంటి వారిని వెనక్కి తోయడం గమనార్హం. పవన్ కళ్యాణ్ కేవలం 16 కోట్ల సంపాదనతో 74 స్థానంలో ఉన్నారు. రజనీకాంత్ రూ. 37 కోట్ల సంపాదనతో 45వ స్థానంలో ఉన్నారు. మహేష్ బాబు సినిమాలతో పాటు డజనుకు పైగా బ్లాండ్లకు ప్రచారం చేస్తూ అత్యధికంగా సంపాదిస్తున్న విషయం తెలిసిందే.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved