A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » మహేష్ బాబు నాకు మెసేజ్ పెట్టాడు

మహేష్ బాబు నాకు మెసేజ్ పెట్టాడు

{[['']]}


నేను ఆయనని కలవలేదు...ఫోన్ లో మాట్లాడలేదు కానీ ఆయన నాకు పర్శనల్ గా మెసేజ్ పెట్టారు... ఆయన చాలా కూల్...ఫ్రెండ్లీ నాచుర్, ఆయన తన విషెష్ ని నాకు తెలియచేసారు ...ఆయన నేను ఒక్కడు రీమేక్ చేయటం గుడ్ ఛాయిస్ అని మెచ్చుకున్నారు. నేను నా చిత్రం ఫస్ట్ పోస్టర్స్ ని ఆయనతో షేర్ చేసుకున్నాను. అలాగే...నా చిత్రం ట్రైలర్ లు చూసారు. ఆయనకు అవి బాగా నచ్చాయి అంటున్నారు అర్జున్ కపూర్. అర్జున్ కపూర్ ప్రస్తుతం ఒక్కడు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలించిన 'ఒక్కడు' చిత్రం హిందీలోకి తేవర్ టైటిల్ తో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా, మనోజ్ బాజపేయి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తోంది. తెలుగులో లాగానే హిందీలోనూ ఘన విజయం సాదిస్తుందని టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తో అంతా ఆనందంగా ఉన్నారు.



Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved