A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ఆటో రిక్షాలో వెళ్లానంటూ గుర్తు చేసుకున్న మహేష్ బాబు

ఆటో రిక్షాలో వెళ్లానంటూ గుర్తు చేసుకున్న మహేష్ బాబు

{[['']]}


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఓ పత్రిక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాన్న అపుడు పెద్ద స్టార్. అయినా నాకు మాత్రం ఆ స్టార్ డమ్ ఫీలింగ్ ఉండేది కాదు. స్కూలుకు ఆటోరిక్షాలో వెళ్లేవాడిని. చిన్నతనంలో సినిమాల్లో నటించినప్పటికీ నా చదువులపై ప్రభావం పడకుండా జాగ్రత్తపడేవాడిని. సమ్మర్ హాలిడేస్‌లో మాత్రమే నటించే వాడిని అని గుర్తు చేసుకున్నారు. ఇతర విషయాలు గురించి చెబుతూ....కూతురు సితార సైంటిస్ట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

తనకు ఇష్టమైన హాలిడే స్పాట్ దుబాయ్ అని తెలిపారు. చెన్నైలో పెరగడం వల్ల తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారని, ఇండస్ట్రీ విషయానికొస్తే త్రివిక్రమ్, శ్రీను వైట్లతో క్లోజ్‌గా ఉంటానని చెప్పుకొచ్చారు.  మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై ఈ మధ్య రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో గాసిప్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్న జగపతి బాబు సినిమాకు తలనొప్పిగా మారాడట. జగపతి బాబు వెన్ను నొప్పితో బాధ పడుతున్నాడని, మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకుంటున్నాడని, ఆయన కారణంగా సినిమా షూటింగ్ లేటవుతోందని అంటున్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved