A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » గౌతమ్ స్కూలుకు వెళ్లిన మహేష్!!

గౌతమ్ స్కూలుకు వెళ్లిన మహేష్!!

{[['']]}


మహేష్ బాబు అంటేనే మహా బిజీగా ఉండే హీరో. అసలు కుటుంబ సభ్యులతో గడపడానికే సమయం సరిపోదు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగులో తలమునకలుగా ఉన్నాడు. కానీ, అంత బిజీ షెడ్యూల్లో కూడా గత వారం తన కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాడు. తన కొడుకు గౌతమ్ చదువుతున్న స్కూల్లో ఓ కార్యక్రమం జరిగితే.. దానికి అందరు తల్లిదండ్రుల్లాగే తానూ వెళ్లాడు. ఉన్నట్టుండి మహేష్ బాబు తమ స్కూలుకు రావడంతో అక్కడున్న పిల్లలతో పాటు టీచర్లు, ఇతర సిబ్బంది కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారని సమాచారం.

అదే సమయంలో, గౌతమ్ కూడా ఎప్పుడూ బయటకు రాని తన తండ్రి ఏకంగా స్కూలుకే రావడంతో చాలా సంతోషించాడట. కొరటాల శివ దర్శకత్వంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా వస్తున్న సినిమా షూటింగు కొంతవరకు పూర్తయిన తర్వాత నూతన సంవత్సర వేడుకలు చేసుకోడానికి కుటుంబంతో కలిసి మహేష్ దుబాయ్ వెళ్తాడని సమాచారం.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved