A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » దాడి ఘటనపై మంచు మనోజ్ తీవ్రంగా...

దాడి ఘటనపై మంచు మనోజ్ తీవ్రంగా...

{[['']]}
‘జబర్దస్త్' వేణుపై గౌడ సంఘాల నేతలు దాడి చేసిన సంఘటనపై నటుడు మంచు మనోజ్ తీవ్రంగా స్పందించారు. దాడి ఘటనను చౌకబారు చర్యగా, అమానవీయ చర్యగా పేర్కొన్నారు. కులం, మతం కంటే ముందు....మనం మనుషులమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.

ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని గౌడ సంఘాల నేతలు వేణుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. వేణుపై జరిగిన దాడిని తెలుగు సినిమా ప్రముఖులు ఖండించారు. తెలంగాణ టెలివిజన్ డెవలప్ మెంటు ఫోరం కూడా ఖండించింది.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved