A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » పోవే... (‘లక్ష్మీ రావే మా ఇంటికి’ రివ్యూ )

పోవే... (‘లక్ష్మీ రావే మా ఇంటికి’ రివ్యూ )

{[['']]}Rating:2/5

ప్రేమకథాచిత్రాలు ప్రేమ చుట్టూనే తిరుగుతుంటాయి. ప్రేమను యువకుడు, యువతికి ఎలా చెప్పాడు. ఎలా సక్సెస్‌ చేశాడు. అనేది రకరకాల కోణాల్లో దర్శకులు తెరకెక్కిస్తుంటారు. స్వతహాగా రచయిత అయిన నంధ్యాలరవి కూడా దర్శకుడు కావాలని కోరికను నెరవేర్చుకున్నాడు.

ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న నాగశౌర్యతో, ఆల్‌రెడీ పేరు తెచ్చుకున్న ముంబై నటి అవిగోర్‌తో ప్రేమకథను తీశాడు. ఇంతకీ... వీరిద్దరి చేత ఏం చూపించాడు. చూద్దాం.

కథ:

ప్రేమను మాత్రం సీరియస్‌గా తీసుకోని కుర్రాడు. ప్రేమంటే ఒట్టి ట్రాష్‌ అనే కుర్రాడు.. తొలిచూపులోనే ఓ అమ్మాయిని ప్రేమించేస్తాడు. ఆమె వెంటపడుతుంటాడు. తనకి నిశ్చితార్థం జరిగిందని చెప్పినా.. ఏదో ఆశతో ఆమెను తనదాన్ని చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఆఖరికి ఆమె ఇంటికికూడా వెళ్ళి వారి నాన్నను ఇంప్రెస్‌చేయడానికి ట్రైచేసి ఫెయిలవుతాడు. అయినా వెంటపడడడంతో విసిగిన ఆ అమ్మాయి మూడురోజుల్లో తన మనసు మార్చమని సవాల్‌ విసురుతుంది. ఇక ఆ తర్వాత ఆ కుర్రాడు వేసిన ఎత్తులు? తర్వాత కథ ఏమిటన్నది సినిమా.

పెర్‌ఫార్మెన్స్‌:

నటుడిగా ఇప్పటికే వ్రూప్‌ చేసుకున్న నాగశౌర్య ఈ సినిమాలో ఎనర్జిటిక్‌ లెవల్స్‌ బాగానే వున్నాయి. చూడగానే చురుకైన కుర్రాడిలా వుండడం ఆయనకు ప్లస్‌. నిశ్చితార్థం అయిన అమ్మాయిగా అవికాగోర్‌ నటించింది. చిన్నారి పెళ్లికూతురు నుంచి పరిచయమైన ఈ అమ్మాయి... ఈ సినిమాలో కాస్త లావుగా కన్పించింది.

హావభావాలు బాగానే ప్రదర్శించింది. ఆమె తండ్రిగా డిసిప్లెన్‌ మనిషిగా రావురమేస్‌ పోషించాడు. సీనియర్‌ నరేశ్‌ హీరో తండ్రిగా నటించాడు. హీరోకు స్నేహితులుగా జబర్‌దస్త్‌ టీమ్‌ చేసింది. వీరంతా తమ పాత్రలకు తగు న్యాయం చేశారు. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌ చేయడానికి వెన్నెల కిశోర్‌ పాత్ర, గే గా సత్యంరాజేష్‌ పాత్రలు ఎంటర్‌టైన్‌ చేస్తాయి.

టెక్నికల్‌గా...

సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ఆకర్షణ. సంగీతపరంగా రాధాకృష్ణ మళ్ళీ హాయిగా వినిపించే ట్యూన్స్‌ ఇచ్చాడు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే దర్శకుని చేతుల్లో వున్నాయికాబట్టి వాటిని న్యాయం చేశాడు. ఎడిటర్‌కు పెద్ద పనే. మొదటిభాగంలోనూ, ద్వితీయభాగంలోనూ కథ సాగదీసినట్లుంటుంది. మిగిలిన డిపార్ట్‌మెంట్లు అన్నీ పర్వాలేదు. నిర్మాతగా హీరోయిన్ల డేట్స్‌ చూస్తే గిరిధర్‌ తొలిసారిగా నిర్మాతగామారి తీసిన చిత్రం.

విశ్లేషణ:

ఇందులో సన్నివేశాలు కథనాలు గతంలోని కొన్ని సినిమాల్లో వున్నట్లు అనిపించినా... మొత్తంగా ఎంటర్‌టైన్‌ చేయడమే ధ్యేయంగా దర్శకుడు ఏర్పాట్లు చేసుకున్నాడు. నిశ్చితార్థం అయిన అమ్మాయిను ప్రేమించడం, ఆమె తండ్రిని ప్రేమించిన యువకుడ్ని చీత్కారం కొట్టడం మామూలే. అలాంటి వ్యక్తిని ఒప్పించాలంటే..ఏదో పాయింట్‌ హీరోకు కావాలి. ఆ పాయింటే హీరోహీరోయిన్లను కలుపుతు. తన తండ్ర చేసిన తప్పును ఆమె సరి చేస్తుంది. ఇదే సినిమా కథకు మూలం. అక్కడే దర్శకుడు సంభాషణలు బాగా రాసకున్నాడు.

ప్రేమ, పెండ్లి గురించి అడ్డగోడకట్టుకున్నావని అంటాడు హీరో. ఈ పాయింట్‌ను కథగా అల్లుకుని దర్శకుడు తీసిన చిత్రం. మిగిలిన వన్నీ ఎంటర్‌టైనన చేయడానికి రకకాలు పాత్రలు, సీన్లు వుంటాయి. ఎన్ని చేసినా.. యూజ్‌ అండ్‌ త్రో అలా.. కథ పెద్దగా కనెక్ట్‌ కాదు. సినిమాకు ఫీలింగ్స్‌ ముఖ్యం. చిత్రం మొదట్లో హీరోచేత.. ఆడవాళ్ళమీద తనకేమీ ఫీలింగ్స్‌లేవనీ చెప్పిస్తాడు. దానికి తగినట్లుగానే సినిమా తీశాడు. అయితే.. ఏతావాతా ... ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూసేట్లుగా నిర్మాత చిత్రించడం మంచి పరిణామం.

Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved