A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ నాగార్జున మేనకోడలు

తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ నాగార్జున మేనకోడలు

{[['']]}


ఈ మధ్యకాలంలో ఎక్కువగా టాలీవుడ్ సెలబ్రెటీలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడటం వార్తలకు ఎక్కడం చూస్తున్నదే. తాజాగా అక్కినేని నాగార్జున మేనకోడలు అనుమోలు సాహిత్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి మీడియాకు ఎక్కారు. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. శనీవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెను ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేస్తున్నట్లు గమనించి అదుపులోకి తీసుకున్నారు.

జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పోలీస్ ఇన్సపెక్టర్ టి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ... ఒకామె.. జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 14లో AP09CF 0919 నెంబర్ గల కారులో వెళ్తూంటే ఆపుచేసాం. ఆమెకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేస్తే... ఆమె రక్తంలో ఆల్కహాల్ కంటెంట్.. నలభై మిల్లీ లీటర్లు ఉంది. 30 మిల్లీ లీటర్లు వరకూ పర్మిషన్ ఉంది. దాంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేసాం.


అలాగే... ఆమె తనను తాను సాహిత్యగా పరిచయం చేసుకుందని చెప్పారు. ఆ కారు అక్కినేని నాగేశ్వరరావు గారి పేరున రిజిస్టర్ అయ్యి ఉందని, దాన్ని సీజ్ చేసామని చెప్పారు. ఆిమె తాగి డ్రైవ్ చేస్తోందని, ఆ సమయంలో ఆమె ఒంటిరిగా ప్రయాణం చేస్తోందని చెప్పారు. సోమవారం ఆమ కౌన్సిలింగ్ కు హాజరుకావాల్సి ఉంటుందని, కోర్టుకు మంగళవారం హాజరుకావాల్సి ఉంటుందనితెలిపారు.

అలాగే సాహిత్య రెండు వేల రూపాయలు...ఫైన్ కట్టాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే మిగతా శిక్ష ఏమిటన్నది కోర్టు వారు నిర్ణయిస్తారని తెలిపారు. ఆమె అనుమోలు నాగ సుశీల కుమార్తె. నాగార్జునకు ఆమె అక్క. నాగ సుశీల కుమారుడు సుశాంత్ ...హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved