A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » తాతగారింటికి దారేది...(‘చిన్నదాన నీకోసం’ రివ్యూ)

తాతగారింటికి దారేది...(‘చిన్నదాన నీకోసం’ రివ్యూ)

{[['']]}పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం 'అత్తారింటికి దారేది'. ఆ సినిమా కథని తీసుకుని హీరో పాత్రని హీరోయిన్ చేసేసి, తాత దగ్గరకు అత్తను తీసుకువెళ్లే కాన్సెప్టుని కొద్దిగా మార్చి.. ...తాతనే ...తన తల్లి తండ్రుల దగ్గరకు తీసుకు వెళ్తే...ఏమౌతుంది..ఎలా ఉంటుంది...అంటే ‘చిన్నదాన నీకోసం' సినిమా కథలాగ ఉంటుంది. అదేంటి ..ఆల్రెడీ కొంచెం అటూ ఇటూలో ..యాజటీజ్ రివర్స్ లో గోవిందుడు అందరివాడేలే చూసాం కదా అంటారా...ఇప్పుడు ఇదీ చూడండి.. అంటూ నితిన్ తనకు పవన్ మీద అభిమానం చూపించుకుంటూ ఇలా రంగంలోకి దిగాడు.

అంతేకాకుండా పవన్ అభిమానులను ఆకర్షించటానికి..పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంలోని 'యే చికిత...' పాటలోని ప్రారంభంలో వచ్చే పవన్ కౌబాయ్ గెటప్ ఫుటేజ్ ని తీసుకుని కలిపివదిలారు. అయితే ఎన్ని ఉన్నా...అది 'అత్తారింటికి దారేది' అనుకరణే అవుతుంది కానీ...మ్యాజిక్ క్రియేట్ కాదనే విషయం మర్చిపోయారు. ఫస్టాఫ్ ఫన్ తో పరుగెత్తినా....సెకండాఫ్ డెడ్ స్లో అయిపోయి, డీవియేట్ అయ్యిపోయి విసుగెత్తించింది. ముఖ్యంగా ఇది హీరో కథ కాదు... హీరోయిన్ తన తాతను తీసుకెళ్లి తన తల్లితండ్రులు కలిపే కథ కావటంతో నితిన్ కూడా చేయటానికి ఏమీ లేక ఏదో సహాయపాత్రలాగ మిగిలాడు.

కథ : 

నితిన్‌ తిని తొంగునే రకం. ఆడవారికి అన్యాయం జరిగితే కాపాడే గుణం. ఓ సందర్భంలో  ఓ పెద్దాయన రెడ్డిగారు(నాజర్‌) నితిన్‌ చేష్టలు చూసి ఈ కాలంలో ఇలాంటి యూత్‌ ఉన్నాడని అతని ఫ్యాన్‌ అయిపోతాడు. కాగా నితిన్, నందిని(మిస్తీ)ని తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. ఆమె ప్రేమ కోసం రకరకాల పాట్లు పడతాడు. ఆఖరికి రెడ్డిగారి పెంట్‌హౌస్‌లో ఆమెకు ఇల్లు అద్దెకు ఇచ్చేలా సాయపడతాడు. అలా వారి పరిచయం ప్రేమగా మారుతున్న సమయంలో నితిన్‌కు హ్యాండ్‌ ఇచ్చి నందిని, రెడ్డిగారితో యూరప్‌ వెళ్ళిపోతుంది. మూడురోజుల తర్వాత రమ్మని నితిన్‌కు ఏర్పాటు చేస్తుంది. కానీ అది ఫేక్‌ టిక్కెట్‌ అని తెలిసి... ఆమె చేసిన మోసానికి తగిన శిక్ష వేయాలనుకుంటాడు. అది ఎలా అనేది మిగిలిన సినిమా.

పైన చెప్పుకున్నట్లు వాస్తవానికి ఈ కథ హీరో వైపు నుంచి చెప్పబడలేదు. సమస్య అతనికి కాదు. పోని హీరోయిన్ సమస్యను తీసుకుని తన భుజం మీద వేసుకుని అక్కడ నుంచి సమస్యలు వస్తే అతను కథలో ఇమిడిపోయేవాడు. అలాకాకపోవటంతో హీరోయిన్ ..తన తాతని, తన తల్లి తండ్రులతో కలుపుతుందా లేదా అన్నది ప్రధానంగా హైలెట్ అయ్యింది. సినిమాలో ఉన్న ఏకైక ఎమోషన్ ని ఆమె లాక్కెళ్లిపోయింది. పోనీ అదైనా సరిగ్గా ఎలివేట్ చేసారా అంటే అదీ లేదు. అత్తారింటికి దారేది సినిమాలో తాత గారి ఆరోగ్య పరిస్ధితి బాగోలేదు...ఆ పెద్దాయన తన కూతురుని చూడాలని కొట్టిమిట్టాడుతున్నాడు అన్న సమయంలో హీరో బయిలుదేరటంతో, అది టైమ్ లైక్ అదీ సెట్ అయ్యింది. ఇక్కడ అలాంటిదేమీ లేదు...హీరోయిన్ కి తన తాతని, తల్లి తండ్రులను కలపాలనిపించింది..అంతే బయిలుదేరింది...అది అబద్దం ఆడి తీసుకుని వెళ్లాలనుకుంది కానీ, ఒప్పించి తీసుకెళ్లాలనుకోలేదు. ఇలా ఆమె పాత్ర సరిగ్గా జస్టిఫై చెయ్యలేదు. హీరో క్యారెక్టర్ అయితే సరేసరి.


టెక్నికల్‌గా... 

సినిమాటోగ్రఫి బాగుంది. అలాగే అనూప్ సంగీతం కూడా సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ మాత్రం సెకండాఫ్ లో నత్త నడక నడిచింది..దాన్ని మరింత స్పీడ్ చేసి ఉంటే బాగుంది.సంగీతపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనూప్‌లో పాత బాణీల ఛాయలు కన్పించాయి. టైటిల్‌సాంగ్‌ పాతదే అయినా కొత్తగా ఇచ్చే ప్రయత్నం చేశాడు. గ్రాఫిక్స్‌లో చేప చేత డాన్స్‌ వేయడం బాగుంది. పాటలపరంగా సాహిత్యం పర్వాలేదు.


విశ్లేషణ

నితిన్ కు ఇలాంటి క్యారెక్టర్స్ కొట్టిన పిండిలా మారాయి. లుక్స్,గెటప్స్ విషయంలో మార్పుని చూసుకుంటున్నాడు కానీ క్యారెక్టర్ మాత్రం అదే చేస్తున్నాడు గత మూడు చిత్రాల్లో కంటిన్యూగా. ఇక పవన్ ఫ్యాన్ గా కూడా బాగా చేసాడు. నిజ జీవితంలోనూ పవన్ ఫ్యాన్ కావటంతో అది ప్రతిఫలించింది.

సినిమాలో గే కామెడీ బాగా విసుగించింది..దాన్ని తొలిగిస్తే మేలు. ఏదో గుండెజారి గల్లంతైందిలో హిట్టైంది కదా అని దాని మోడల్ తెచ్చి పెట్టారు. ఆ ఎపిసోడ్ ఎంత జుగుప్స కలిగించిందీ అంటే జనం లేచి వెళ్లేంత.

నితిన్ కి జోడీగా నటించిన బాలీవుడ్ భామ మిష్తి చక్రవర్తి...గ్లామర్ గా ఉంది. ట్రెడిషనల్ డ్రస్ లలోనూ, మోడ్రన్ డ్రస్ లలో నూ బాగానే కనిపించింది. తెలుగులో ఆమెకు అవకాశాలు ఇచ్చినా ప్రూవ్ చేసుకునేటట్లు ఉంది.

దర్శకుడుగా కరుణాకరన్...ఎందుకనో తొలి ప్రేమ నాటి మ్యాజిక్ ని ఎప్పుడో కోల్పోయినట్లు ఈ మధ్య వచ్చిన ఆయన సినిమాలు చూస్తూంటే అనిపిస్తోంది. ఒరిజినాలిటి వదిలేసి ఇలాంటి స్ఫూఫ్ ఐడియాతో ఎలా వచ్చాడో మరి. దర్శకత్వంలో కూడూ పెద్ద చెప్పుకోదగ్గ మెరుపులూ లేవు, స్క్రీన్ ప్లే లో మలుపులూ లేవు.

చిత్రం ఫస్టాఫ్ ఎత్తుగడ మెల్లిగా ఓకే అనిపించుకుంటూ కాసేపటికి ఫరవాలేదు అనిపించింది. ఇంటర్వెల్ కూడా అద్బుతం అనిపించకపోయినా ఓకే అనిపించింది. ఇక సెకండాఫ్ కష్టం అనిపించింది.

చిత్రంలో తాగుబోతు రమేష్ కామెడీ మాత్రమే పేలింది. మిగతాది సోసో. గే కామెడీ అయితే వికారం పుట్టించింది. మాటల రచయిత..హర్షవర్ధన్..ఇంతకుముందు చేసిన గుండెజారి గల్లంతయ్యింది, ఇష్క్, మనం చిత్రాల మ్యాజిక్ ని చేయలేకపోయారు. కథ సహకరించినట్లు లేదు.Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved