A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ఆంధ్రా పోరి వెనక పూరి కొడుకు

ఆంధ్రా పోరి వెనక పూరి కొడుకు

{[['']]}



పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. 'ఆంధ్రాపోరి' టైటిల్ తో ఆ చిత్రం రూపొందనుంది. రాజ్ మదిరాజు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఈ రోజే లాంచ్ అయ్యింది. ప్రసాద్ ల్యాబ్ ఎండీ రమేష్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉల్కా గుప్త హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం టైం పాస్ అనే మరాఠీ చిత్రం రీమేక్.


జనవరి నుంచి షూటింగ్ జరిగే ఈ చిత్రం ప్రారంభానికి పూరి జగన్నాథ్, లావణ్య, సాయిరామ్ శంకర్ వచ్చారు. ఓపినింగ్ సింపుల్ గా చేసారు. ఇంకా పలువురు చిత్ర రంగ ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియచేసారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved