A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » సోసోగా... (‘లింగ’ రివ్యూ)

సోసోగా... (‘లింగ’ రివ్యూ)

{[['']]}
Rating:2.75/5

మాస్ మసాలా చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారి...వాటితోనే సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ మరోసారి అదే ఫార్ములాని నమ్మి థియోటర్స్ లోకి దిగారు. అడుగడుగుకీ మసాలాని,గ్లామర్ ని గుప్పించే ప్రయత్నం చేసిన ఈ చిత్రం రజనీ ఈ మధ్య వచ్చిన చిత్రాల్లో చాలా చాలా స్పీడుగా చేసిన చిత్రం. అయితే సినిమా నేరేషన్ లో మాత్రం అంత స్పీడు లేదు. ఫస్టాఫ్ ఇంటర్వెల్ వరకూ లాగినట్లై, ప్రీ ఇంటర్వెల్ దగ్గర వేడిక్కింది. సెకండాఫ్ సైతం అలా..అలా వెళ్లిపోయింది కానీ బలమైన ముద్ర వేయిలేకపోయింది. ముఖ్యంగా రజనీ వంటి స్టార్ చిత్రాల నుంచి ఆశించే పూర్తి స్ధాయి ట్విస్టులు, ఎంటర్టైన్మెంట్ మాత్రం కరవైంది. కథ,కథనం రొటీన్ గా చాలా ప్రెడిక్టబుల్ గా సాగింది. రజనీ అభిమానలకు ఆ స్టైలిష్ లుక్ లు, పంచ్ లు అద్బుతమనిపించవచ్చేమో కానీ సాధారణ ప్రేక్షకుడుకి మాత్రం యావరేజ్ చిత్రం చూసినట్లే అనిపిస్తుంది. రోబో, శివాజి చిత్రాల కన్నా ముందు ఈ చిత్రం వచ్చి ఉంటే తప్పుకుండా బాగుండేది అనిపించేది.


కథ : 
రాజా లింగేశ్వర(రజనీకాంత్‌) గద్వాల్‌ సంస్థానం మహారాజు. బ్రిటిష్‌ ప్రభుత్వంలోని భారతీయ కలెక్టర్‌. తను పుట్టిన గడ్డ కోసం ఏదైనా మంచి పని చేయాలనుకొనే దాతృత్వం కలిగిన వ్యక్తి. సింగానూరు గ్రామంలోని రైతుల కష్టాలు చూసి, వాళ్ల  కోసం ఒక డ్యామ్‌‌ను నిర్మించాలనుకొంటాడు. అయితే బ్రిటిష్‌ ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో, తన స్వంత డబ్బుతో ఆ డ్యామ్‌‌ను పూర్తి చేయాలనుకొంటాడు. అనుకున్నట్లుగానే డ్యామ్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. అయితే మరో బ్రిటిష్‌ కలెక్టర్‌ పన్నిన పన్నాగం కారణంగా, తాను మంచి చేసిన ఊరి వాళ్ల చేత అవమానింపబడి వేరే గ్రామానికి వెళ్ళిపోతాడు.

ఆ సమయంలో ఆయన నిర్మించిన శివాలయాన్ని ఊరి ప్రజలు మూసేస్తారు. కానీ తర్వాత ఆయన గొప్పతనాన్ని తెలుసుకొన్న ఊరి ప్రజలు ఆయన్ను తిరిగి ఊరికి రప్పించి, ఆయన చేతే గుడిని తెరిపించాలనుకొంటారు. అయితే రాజా లింగేశ్వర అందుకు అంగీకరించరు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గుడిని ఉన్నపళంగా తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే.. ఆ గుడిని రాజా లింగేశ్వర మనవడు ''లింగ'' (రజనీకాంత్‌) మాత్రమే తెరవాలని ఊరి పెద్ద (కె.విశ్వనాథ్‌) పట్టుబట్టడంతో, ఆయన మనవరాలు లక్ష్మి(అనుష్క) లింగను వెతికి పట్టుకుంటుంది.

గుడిని ఉన్నపళంగా తెరవాల్సిన అవసరం ఏంటి?, మినిస్టర్‌ (జబపతిబాబు) డ్యామ్‌ కూల్చేయాలని ఎందుకు ప్లాన్‌ చేస్తాడు ? రాజా లింగేశ్వర మనవడు లింగ తన తాత కట్టిన డ్యామ్‌ ను కాపాడుకోగలిగాడా? లేదా? అనే ఆసక్తికర అంశాల సమాహారమే ''లింగ'' చిత్రం.

విశ్లేషణ:  

రాజా లింగేశ్వరగా, లింగగా రెండు విభిన్నమైన పాత్రల్లో రజనీకాంత్‌ అద్భుతంగా నటించారు. తనదైన స్టైల్‌ తోపాటు అబ్బురపరిచే మ్యానరిజమ్స్‌ తో అలరించారు. రజనీకాంత్‌ సరసన నటించిన అనుష్క, సొనాక్షి సిన్హా అందంతో పాటు అభినయంతో ఆకట్టుకొన్నారు. సంతానం తనదైన సంభాషణలతో కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. దానికి పంచ్‌ డైలాగ్‌లు తోడయ్యాయి. రత్నవేలు ఫొటగ్రఫీ బాగుంది. డ్యామ్‌ బిల్డింగ్‌ సీన్స్‌ మరియు ట్రైన్‌ ఫైట్‌ సీన్‌ పిక్చరైజేషన్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణ. రజనీ సినిమాలో కన్పించాలనే తపనతో... రజనీ ఇంట్రడక్షన్‌ సాంగ్‌లో చిత్ర నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌, రత్నవేలు తళుక్కుమని మెరిపించగా, ముగింపులో దర్శకుడు రవికుమార్‌ పోలీసు అధికారిగా కన్పిస్తాడు.

ఫ్లాష్ బ్యాక్ లు చూడ్డానికి జనం సినిమాలుకు రారు.. ఆ ఫ్లాష్ బ్యాక్ తర్వాత ప్రెంజెట్ లో ఏం జరుగుతుందనేది ఎప్పుడూ ఆసక్తికరం...ఎందుకో స్క్రీన్ ప్లేను తనే రాసుకున్న ఈ సీనియర్ దర్శకుడు ఆ విషయం మర్చి...సినిమాలో ముప్పాతిక భాగం...ప్లాష్ బ్యాక్ కే కేటాయించాడు.

రజనీకాంత్ ఫెరఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు. ఆయన ఈ వయస్సులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా స్టెప్స్ వేయటం, స్టైల్స్ ని ప్రదర్శించటమే ఆశ్చర్యమనిపిస్తుంది. అలాగే ఆయన రెండు గెటప్ లలోనూ డిఫెరెన్స్ ను చూపించి తనలోని నటుడుని మరోసారి మనముందు ఉంచారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో ఆయన చాలా బాగున్నారు.

అనుష్క   ఈ సినిమా కోసమో మరి దేని కోసమో కానీ ఆమె బాగా ఒళ్లు చేసింది. అయితే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా తక్కువ సేపు సాగింది. టీవి రిపోర్టర్ గా మాత్రం ఆమె సూట్ కాలేదు అనిపించింది.

సోనాక్షి సిన్హా...   ప్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్రలో సోనాక్షి సిన్హా ఒదిగిపోయింది. అవసరమైన చోట తన లోని నటిని సైతం ఆమె బాగానే ఆవిష్కరించింది. వింటేజ్ లుక్ తో సోనాక్షి సినిమాకు కొత్త అందం తెచ్చింది.

కాగా, కథలో పట్టు ఉన్నప్పటికీ కథనంలో వేగం లేకపోవడం పెద్ద మైనస్‌. ఎ.ఆర్‌.రెహమాన్‌ పాటల్లో పస లేదు. ఆర్‌.ఆర్‌ కూడా అంతంత మాత్రంగా ఉంది. రజనీకాంత్‌ అభిమానులు ఆనందించే విధంగా ఆయనపై బిల్డప్‌ షాట్స్‌ ను ఎక్కువగా ప్లాన్‌ చేసుకొన్న దర్శకుడు సగటు సినిమా అభిమానులను అలరించేలా మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. క్లైమాక్స్‌ సీన్‌ లో బెలూన్‌ ఫైట్‌ సినిమాటిక్‌తో కూడిన కృతంగా వుండటం ప్రధాన లోపం.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved