A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » అరవింద్ గారూ... నాతో కాదు... ముందు చిరంజీవి 150 చేయండి... రజినీ సెటైర్

అరవింద్ గారూ... నాతో కాదు... ముందు చిరంజీవి 150 చేయండి... రజినీ సెటైర్

{[['']]}అల్లు అరవింద్ గారు నాతో సినిమా తీస్తానని అన్నారనీ, ఐతే ముందుగా చిరంజీవి 150వ చిత్రం తీసిన తర్వాత తన గురించి ఆలోచించాలని రజినీకాంత్ సెటైర్ విసిరారు. హైదరాబాదులోని నోవాటెల్ లో జరిగిన లింగా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడారు. రజినీకాంత్ లింగా ఆడియో కార్యక్రమంలో మాట్లాడుతూ... హుదూద్ బాధితులను ఆదుకునేందుకు మేము సైతం కార్యక్రమానికి ఓ పెళ్లి ఉండటం వల్ల రాలేకపోయానని అన్నారు. దయచేసి తనను క్షమించాలన్నారు.

ఇకపోతే ఈ లింగా చిత్రం 65 రోజుల్లో తీశారని అన్నారు. సినిమా సబ్జెక్ట్ చాలా పెద్దదైనప్పటికీ చిత్రాన్ని దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించారన్నారు. ఈ చిత్రం మరో 12 రోజుల్లో విడుదలవబోతుంటే ఈ చిత్రం కథ తమదేనంటూ నలుగురు వ్యక్తులు కేసు వేశారనీ, ఐతే ఇది ఆ నలుగురిదీ కాదనీ, చిత్ర దర్శకుడిదేనని చెప్పారు.

ఈ చిత్రంలో అనుష్క, సోనాక్షిలతో స్టెప్పులు వేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. 60 ఏళ్ల వయసులో తన కుమార్తె వయసున్నవారితో డ్యాన్సు చేయడం ఎంత కష్టమో తెలిసిందన్నారు. ఓ ఆర్టిస్టుకి ఇంతకంటే పెద్ద శిక్ష ఉండదని అన్నారు. ఈ చిత్రాన్ని తమిళ ప్రజలు ఆదరించినట్లే తెలుగు ప్రజలు కూడా ఆదరించాలని కోరారు.

ఇంత పెద్ద సినిమా చిత్రీకరణ 6 నెలల్లో పూర్తి కావడం చాలా గ్రేట్. అలా అని లింగా సినిమాను ‘బాహుబలి' చిత్రంతో కంపేర్ చేయొద్దు. ఆ సినిమా రెండు పార్టులు. రాజమౌళి నెం.1 టెక్నీషియన్. ఆయన లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండటం తెలుగు వారికి గౌరవం అన్నారు. అవకాశం వస్తే ఆయనతో నటిస్తాను అన్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved