A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » షాక్ : ఆడియో వేడుకలో డైరెక్టర్ చెంప చెల్లుమనిపించింది

షాక్ : ఆడియో వేడుకలో డైరెక్టర్ చెంప చెల్లుమనిపించింది

{[['']]}

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె స్నేహితురాలు కారణంగా రాఖీకి ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. వివరాల్లోకి వెళితే...ముంబైలో 'ముంబై కెన్ డ్యాన్స్ సాలా' (Mumbai Can Dance Saala) సినిమా మ్యూజిక్ లాంఛ్‌ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రాఖీ సావంత్‌, డైరెక్టర్ సచేంద్ర శర్మ ఇతర టీమ్ మొత్తం స్టేజ్‌పై బిజీగా ఉంది. ఇంతలో రాఖీ ఫ్రెండ్, ఓ మోడల్ వేదికపైకి దూసుకొచ్చింది. వస్తూ వస్తూనే డైరెక్టర్‌ను లాగి పెట్టి ఒక్కటిచ్చింది. అమ్మడి చెంప దెబ్బకు డైరెక్టర్‌కు దిమ్మ తిరిగిపోయింది. దాంతో కాసేపు ఇద్దరి మధ్య ఢిష్యుం డిష్యూం జరిగింది.


ఇంతకీ మ్యాటరేంటీ అంటే? రాఖీ స్నేహితురాలకి సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూనే, అందుకోసం ఆమె చాలా చాలా పనులు చేయాలని దర్శకుడు శర్మ షరతులు పెట్టాడట. సినిమా నుండి రాఖీ సావంత్ సాంగ్ ఎందుకు తీసేసారు అంటూ గొడవ పడింది.ఆ విషయాన్నే నిలదీస్తూ ఆమె స్టేజ్‌పై దర్శకుడికి సినిమా చూపించింది. అక్కడితో ఆగలేదు.. రాఖీ, ఆమె స్నేహితురులు కలిసి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పబ్లిసిటి కోసమే రాఖీ సావంత్‌ ఇదంతా చేస్తోందని కొంతమంది ఆరోపిస్తుండగా .. అలాంటిదేమీ లేదని ఆమె కొట్టిపారేస్తోంది.

మరోవైపు అసలేం జరిగిందంటూ దర్శకుడు శర్మను అడిగితే.. అదంతా చీప్ పబ్లిసిటి కోసం  చేసిన డ్రామా అని చెప్పటం విశేషం. అయితే ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండే.. రాఖీ సావంత్ తన ఫ్రెండ్‌తో కలిసి కావాలనే అలా చేసిందా లేక నిజంగానే అనేది వాళ్లకే తెలియాలి మరి. ఇంతకీ ఆ ఫ్రెండ్ పేరు కూడా ఎవరికీ తెలియక పోవటం గమనార్హం.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved