A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » ఎంఎస్ ధోనీ చిత్రంలో...సురేష్ రైనా పాత్రలో రామ్ చరణ్

ఎంఎస్ ధోనీ చిత్రంలో...సురేష్ రైనా పాత్రలో రామ్ చరణ్

{[['']]}


టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత కథతో బాలీవుడ్ దర్శకుడు నీరజ్‌ పాండే ఓ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో. ‘ఎంఎస్ ధోని' అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ధోనీ భార్య సాక్షి సింగ్ ఈ పోస్టర్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. పోస్టర్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 7వ నెంబర్ గల టీమిండియా జెర్సీ ధరించాడు. 7 నెంబర్ అనేది ధోనీకి చాలా స్పెషల్. ఎందుకంటే ధోనీ పుట్టిన రోజు 7/7/1981. కాగా...ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సురేష్ రైనా పాత్ర పోషించబోతున్నాడని అంటున్నారు.

రామ్ చరణ్ ఈ సినిమాకు సైన్ కూడా చేసాడని టాక్. టీమిండియా క్రికెట్లో ధోనీ, రైనా మధ్య మంచి అనుబంధం ఉంది. వారి స్నేహ బంధాన్ని ధోని తెరపై ఆవిష్కరించబోతున్నారట.

ధోనీ సినిమాను ప్లాన్ చేసుకున్న నీరజ్ పాండే ప్రయత్నాలకు బీసీసీఐ తాత్కాలికంగా అడ్డు పడి షాక్ ఇచ్చింది. ధోని క్రికెట్‌లో కొనసాగుతున్నంత కాలం ఆయన జీవితకథతో సినిమా తీయడానికి వీల్లేదని బి.సి.సి.ఐ. తేల్చి చెప్పింది. ఆయన క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక సినిమా నిర్మిస్తే తమకేమి అభ్యంతరం లేదని ప్రకటించింది. ధోనీ ఆటపై ప్రభావం చూపుతుందనే కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 100 కోట్లతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

చిత్ర హక్కుల కోసం ధోనికి 40కోట్ల భారీ మొత్తాన్ని ముట్టజెప్పారనే వార్తలు వినిపించాయి. అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దర్శక నిర్మాతలకు మింగుడు పడటం లేదు. ఇటీవల క్రీడాకారుల జీవితాలపై తీసిన....‘భాగ్ మిల్ఖా భాగ్', ‘మేరీ కోమ్' లాంటి చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. దేశంలో క్రికెట్ ను అభిమానించే వారి సంఖ్యే ఎక్కువ కాబట్టి ఈ చిత్రానికి భారీ స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved