A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » సారీ చెప్పని రాంగోపాల్ వర్మ సారీ చెప్పారు... ట్విట్టర్లో ఎందుకంటే...?

సారీ చెప్పని రాంగోపాల్ వర్మ సారీ చెప్పారు... ట్విట్టర్లో ఎందుకంటే...?

{[['']]}మనిషన్నాక పొరపాట్లు చేయటం మామూలే. ఐతే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కొంతమందే చేస్తుంటారు. దాన్నిబట్టి సంఘంలో వారి గౌరవమర్యాదలు ఇనుమడిస్తాయి. రాంగోపాల్ వర్మ తను ట్విట్టర్ ద్వారా చేసిన పొరపాటుకు సారీ చెప్పేశారు. దీనికి కారణం ఏంటంటారా... ఆయన తాజాగా ప్రముఖ దర్శకుడు ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంటే... ఆయన చనిపోయినట్లు అనుకుని... అందుకు ఆయనకు సంతాపం తెలుపుతున్నట్లు ట్వీట్ చేసేశారు. ఆ తర్వాత రివర్స్ ట్వీట్లు చూసి నాలుక్కరుచుకుని వెంటనే రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పారు.

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ..."నేను బాలచందర్ గారి గురించి చేసిన ట్వీట్ కు క్షమాపణ చెప్తున్నాను...నేను రూమర్ కాదో చెక్ చేసుకోకండా ట్వీట్ చేసాను... ఆయన స్పీడ్ గా రికవరీ కావాలని కోరుకుంటున్నా". అని అన్నారు. గత కొద్ది రోజులుగా బాలచందర్ ఆరోగ్య పరిస్ధితేం బాగోలేదు. మీడియా మొత్తం ఈ విషయమై కేంద్రీకరించి ఉంది. హాస్పటిల్ వైద్యులు బులెటెన్స్ విడుదల చేస్తున్నారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved