A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » నైట్ పార్టీలో రానా - బిపాసా ఖుషీఖుషీగా....

నైట్ పార్టీలో రానా - బిపాసా ఖుషీఖుషీగా....

{[['']]}బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో చారిత్రాత్మక పాత్రలు పోషిస్తున్న రానా వార్తల్లో నానుతూ ఉంటాడు. ఇటీవల ట్విట్టర్లో త్రిష-రానాల కామెంట్ల యుద్ధం తెలిసిన సంగతే. ఇపుడు రానా మరోసారి బాలీవుడ్ పత్రికలకు పనిపెట్టాడు. రానా తన పుట్టినరోజు వేడుకను బాలీవుడ్ సెక్సీ నటి బిపాసా బసుతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక ఉటంకించింది.

అంతేకాదు... ఆరోజు రానా తన మిత్రులను పిలిచాడనీ, బిపాసాబసు, రానా ఇద్దరూ నైట్ పార్టీలో సూపర్బ్ గా ఎంజాయ్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బిపాసతో రానా డేటింగ్ కూడా చేస్తున్నాడంటూ ఆ అంగ్ల పత్రికలో కథనం వచ్చింది.

మరో విశేషం ఏంటయా అంటే, ఆ పార్టీకి మరో అతిథిగా కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మి రాయ్ కూడా రావడం. కాగా 2011లో విడుదలైన ‘దమ్మోర దమ్’ సినిమా షూటింగ్ వీరి మధ్య ఏదో ఉందన్న గుసగుసలు వినిపించాయి. ఇపుడు ఇలా ఒక నైట్ క్లబ్ లో ప్రత్యక్షం కావడంతో మళ్లీ గుసగుసలు బయలుదేరాయి.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved