A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » రామ్ గోపాల్ వర్మ ...సూసైడ్ టాపిక్కే అంతటా

రామ్ గోపాల్ వర్మ ...సూసైడ్ టాపిక్కే అంతటా

{[['']]}


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఏది మాట్లాడినా సంచలనమే. ఇప్పుడు మరోసారి సంచలనాత్మక స్టేట్‌మెంట్‌ వదిలి హాట్ టాపిక్ గా నిలిచారు. తాను ఏదైనా వ్యాధితో తాను మంచాన పడి ఎవరిపైనైనా ఆధారపడాల్సి వస్తే ఒక్క క్షణంకూడా ఆలోచించకుండా ఆత్మహత్మ చేసుకుంటానన్నారు. అసలు నేను రోగాన పడటాన్నే అసహ్యించుకుంటాను. ఇతరులు నా బాగోగులు చూడడాన్ని ద్వేషిస్తా అని చెప్పారు. అలాగే ...నా మరణం గురించి ముందే తెలిస్తే ఎవరికీ కనబడకుండా వెళ్లిపోతా..నేను ఏకాంత మరణాన్ని కోరుకుంటాను అని వర్మ తెలిపారు.

ఇక తన బాడీని ఎవరూ చూడకూడదని, చలనరహితమైన నా శరీరం ఎవరి కంటా పడకూడదని అన్నారు. మరణించిన వ్యక్తి దేవుడితో కలిసి ఉంటాడని ఎవరైనా నమ్మితే అతను డెత్‌ను కూడా సెలబ్రేట్‌ చేసుకోవచ్చన్నారు. చావు సమయంలో ఏడుపూలు, గీడుపూలు నాకు నచ్చవు అని వర్మ తెలిపారు. బర్త్‌ని ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటామో , డెత్‌ని కూడా అలానే సెలబ్రేట్‌ చేసుకోవాలని హితవు చేశారు. ఇదంతా వర్మ ఓ టీవీ షోలో పాల్గొన్నప్పుడు చెప్పిన విశేషాలు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved