A l l L i v e T e l u g u C h a n n e l s
Home » » తమ్మారెడ్డి విమర్శలపై సాయి ధరమ్ తేజ్ ఇలా...!

తమ్మారెడ్డి విమర్శలపై సాయి ధరమ్ తేజ్ ఇలా...!

{[['']]}‘మేము సైతం' కార్యక్రమానికి హాజరు కాని వారిపై ఇటీవల దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. హాజరు కాని వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఉండటంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. తిరుమలలో మీడియా కంటపడ్డ మెగా ఫ్యామిలీ హీరో, పవన్ కళ్యాణ్ మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్‌ను ఈ పాయింటప్ వ్యూలో విలేకరులు ప్రశ్నించారు.

దీనిపై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ...మంచి విషయం కోసం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. అయితే విమర్శల గురించి నాకు తెలియదు. వాటిని పట్టించుకోను. నేను కూడా మేముసైతం కార్యక్రమంలో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాను' అంటూ మరో వివాదానికి తావివ్వకుండా దాటవేత ధోరణి ప్రధర్శించారు సాయి ధరమ్ తేజ్.

ఇటీవల విడుదలైన ‘పిల్లా నువ్వు లేని జీవితం' విజయం సాధించడంతో ఆనందంగా ఉన్న సాయి ధరమ్ తేజ్ శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన తర్వాతి సినిమా గురించి చెప్పారు. దిల్ రాజు బేనర్లో హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం చేస్తున్నట్లు తెలిపారు.


Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved